NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

స్కూలుకి లేటుగా వెళ్లిన టీచర్లు – వాళ్ళకి ఎదురయిన షాక్ !

స్కూలుకి లేటుగా వెళ్లిన టీచర్లు - వాళ్ళకి ఎదురయిన షాక్ !

మన భారత దేశంలో గురువులను “ఆచార్యదేవోభవ“ అంటూ పూజిస్తాం. పిల్లలు సరిగా చదవకపోయినా, స్కూల్ లో వారు ఏదయినా తప్పు చేసినా టీచర్లు వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే మరి టీచర్ లే తప్పు చేస్తే, వారిని ఎవరు శిక్షిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదనుకున్నారో ఏమో కానీ కొందరు టీచర్లు రోజూ స్కూలుకు లేటుగా రావడం మొదలు పెట్టారు. అయితే రానురాను వారు ఇదే అలవాటుగా చేసుకున్నారు. ఇది గమనించిన పిల్లల తల్లిదండ్రులు ఆ టీచర్ లకు చుక్కలు చూపించారు.

స్కూలుకి లేటుగా వెళ్లిన టీచర్లు - వాళ్ళకి ఎదురయిన షాక్ !

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ విధించినందున స్కూల్లు మూసివేశారు. ఎనిమిది నెలల తరువాత ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన కారణంగా కొన్ని స్కూల్ లను తెరిచారు. స్కూల్ లు తెరిచినప్పటికీ అక్కడక్కడ కరోనా కేసులు విజృంభిస్తూ ఉండడంతో అవి కూడా సరిగ్గా జరగడం లేదు. ఇదిలా ఉండగా స్కూల్ లు తెరిచినప్పటికీ ఉపాధ్యాయులు స్కూలుకి ఆలస్యంగా రావడాన్ని పిల్లల తల్లితండ్రులు సహించలేకపోయారు.

ఇది గమనించిన విద్యార్థుల పేరెంట్స్ ఆ టీచర్స్ కి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకుని హెచ్ ఎం గదికి తాళం వేసేశారు. ఏకంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఓబుళపతి తాళం వేసి టీచర్లను నిలదీయడంతో ఏం చెప్పాలో తెలియక వారు తెల్లమొఖం వేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని జిల్లా పరిషత్ హై స్కూల్  లో చోటుచేసుకుంది.

ఇప్పటికే ఎనిమిది నెలల నుంచి కరోనా కారణంగా విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా ఉంటే దానికి తోడు టీచర్లు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ బిడ్డల భవిష్యత్తు ఎం అవుతుందని తల్లితండ్రులు ఉపాధ్యాయులను నిలతీసారు. మన రాష్ట్రంలో నూతనంగా ప్రతి పాఠశాలకి ‘స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ’ లను వైఎస్ జగన్ సర్కార్ విద్యార్థుల పేరెంట్స్ తో నియమించిన విషయం మనకు విదితమే.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju