ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తీసుకున్న మరో నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీస్..!!

Share

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక చదువు ఏ ఒక్కరికి దూరం కాకూడదని అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువులు చదవాలనుకునే పేద వాళ్లకి తనదైన శైలిలో సరికొత్త పథకాలు అమలు చేస్తూ.. చదువు పేదవాడి కుటుంబానికి భారం కాకుండా చూసుకుంటూ ఉన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక ఇంకా అనేక పథకాలతో తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా తనదైన శైలిలో జగన్ పరిపాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.

Chief Minister YS Jagan Mohan Reddy to visit Vizag todayఇలా ఉండగా ఇటీవల అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ల్యాప్ టాప్ లు కూడా అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతగానో సంతోషించారు. కాగా తాజాగా జగన్ సర్కార్ తీసుకున్న మరో నిర్ణయానికి విద్యార్థి తల్లిదండ్రులు మరింతగా సంతోషపడుతున్నారు.

 

మేటర్ ఏమిటంటే పాఠశాలలకు పిల్లలు గనుక హాజరు కాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిసేలా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి పిల్లలు బడికి ఒకరోజు రాకపోతే తల్లిదండ్రుల ఫోన్ కు మెసేజ్ వెళ్లేలా చర్యలు తీసుకోవడమే కాక రెండు రోజులు హాజరు కాకపోతే విద్యార్థి ఇంటికి వాలింటర్ వెళ్లే వ్యవస్థను జగన్ సర్కార్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. విద్యార్థి స్కూలుకు ఎందుకు రాలేదు కారణం ఏంటి అనేది వాలింటర్ అడిగి తెలుసుకో బోతరాట. పిల్లలకు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలను బడికి తీసుకువచ్చే బాధ్యతను గ్రామ సచివాలయాలకి అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద వాలంటీర్ల మీద తల్లిదండ్రులు కమిటీల మీద టీచర్ల పైనా జగన్ సర్కార్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఏంటో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలామంది ప్రముఖులు సూపర్ ఐడియా అని.. ఖచ్చితంగా ఏపీలో విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు చోటు చేసుకోవడమే కాక మంచితరం జగన్ ఆధ్వర్యంలో రాబోతున్నట్లు ప్రశంసిస్తున్నారు.


Share

Related posts

అనన్య ఆ రకంగానే టాలీవుడ్ హీరోలకి ఎరవేస్తుందా ..?

GRK

ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు..! సీఐ,హెచ్‌సిలకు బెయిల్ మంజూరు..!!

Special Bureau

West Bengal : దీదీ వెనుకున్న పవర్ ‘అతడే’నా..!? ఆసక్తి రేపుతున్న ఆ ట్వీట్..!!

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar