Parents: ఈరోజుల్లో ప్రతి ఒక్క జంటకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడం వలన పిల్లలు చాలా గారాబం తో పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిది కాదు అందు లో అది మరీ ఎక్కువ అయితే ప్రమాదం అని గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులు గా ఉండి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందు లో ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే..
తల్లిదండ్రులు చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు.ఆఖరికి తన లంచ్ బ్యాగ్ కూడా శుభ్రం చేసుకోలేరు.
వారు వేసుకున్న బట్టలు కూడా ఉతుక్కుంటారా అంటే అదీ ఆ పని రాదు.కోపం గా మాట్లాడితే అసలు సహించలేక తిరగబడతారు.
కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఇంట్లో వస్తువుల పై చూపెడుతుంటారు. వారు తినే ప్లేట్ కూడా కడుక్కోడానికి బద్దకమే.
ఎక్కువ శాతం ఆడపిల్లలు తండ్రి గారాబం తో పెరుగుతుంటారు. దీంతో తల్లి వారికి నచ్చదు. తల్లి దగ్గర ఏమి నేర్చుకోరు. వారికీ ఇంటిలో ఉండే చిన్న చిన్న పనులు అలవాటు చేయండి..అమ్మకు సహాయ పడేలా చూడండి. అన్ని పనులు చేసి పెట్టడానికి ఎప్పుడు అమ్మ నాన్న ఉండరు వారంతట వారు సొంతపనులు ఇంటి పనులు చేసేలా వారికీ నేర్పండి.
ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కనీసం మంచి నీళ్లు ఇచ్చి పలకరించే వారు పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతవరకూ ఎందుకు వారిమధ్య ఉండే బంధం కూడా వారికీ తెలియదు..నాన్న చెల్లి వరసకు ఏమవుతుంది ?మామయ్య ఎవ్వరు?ఇలాంటి ఇలాంటి వరసలు తెలిసినవారు చాలా తక్కువమందిఉన్నారనే చెప్పాలి.ఇంటిలో ఒక్కే సంతానం ఉంటేకనుక వారిని తప్పకుండ మీ బంధువుల దగ్గరకు తీసుకువెళ్తూఉండండి..వారిని మీ ఇంటికి ఆహ్వానిస్తూ ఉండండి. అప్పుడు వారికీ ఇచ్చిపుచ్చుకోవడం వంటివి అలవాటుఅవుతాయి.ఒంటరి తనం కూడా ఉండదు.