Parents: ప్రస్తుత టెక్నాలజీ కి అలవాటు పడి పాత పద్ధతులు అన్నీ మార్చేస్తున్నారు.ఇంతకీ దీనంతటికీ కారణం పిల్లలు అని అనుకుంటున్నారా కాదు వాళ్ళని ఇలా తయారు చేస్తున్న తల్లిదండ్రులు వీటన్నిటికీ కారణం. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చుకుంటూ పోతూ వారిని సోమరిపోతులు గా తయారు చేస్తున్నారు. చూసేవారికి మనం రిచ్ గా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. దానికి గారాబం తోడవ్వడంతో అడిగిందల్లా ఇచ్చేయడం వలన పిల్లలు ఇలా తయారవుతారు.
పిల్లలలకు కష్టం విలువ తెలిసేలా పెంచితే వారికి ఎలా బ్రతకాలో తెలుస్తుంది. అప్పుడు జీవితం ఆనందంగా గడపగలుగుతారు బాగుపడతారు. అలా కాదని గారాబంగా కష్టమనేది తెలియకుండా పెంచితే చివరికి సమాజం పైన తల్లిదండ్రుల పైన కూడా తిరగబడతారు. ఈ రోజుల్లో 15 ఏళ్లకే సిగరెట్లు, మందు, అమ్మాయిలు ఇలా అన్ని అలవాటు నేర్చేసుకుంటున్నారు. ఇదివరకు కాలంలో మనిషికి 70ఏళ్ళు వచ్చిన మనిషి క్రమశిక్షణ తో దృఢంగా ఉండేవాడు. కాని ఈ రోజుల్లో చిన్న పిల్లల ప్పటి నుంచి,ఏదోక జబ్బు వస్తూనే ఉంటుంది. దానికి కూడా తల్లిదండ్రులే కారణమని చెప్పాలి. ఇంట్లో మంచి తిండి వదిలేసి ఎల్లప్పుడు బయట తిండి తినడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది బాగా అలవాటుగా మారిపోయింది .
ఇప్ప్పుడు రోజులు బట్టి వారికి బాధ్యత,గౌరవం, మర్యాద, ప్రేమ, కష్టం, నష్టం, కుటుంబ సంబంధాలు వంటివి నేర్పాలి. జీవితంలో కష్టం విలువ తెలిసిన వారికి జీవితం లో అపజయం, క్రుంగుబాటు అనేవి ఉండవు కాబట్టి పిల్లను ఆ విధం గా ప్రోత్సహించాలి. వాళ్ళు ఏది నేర్చుకున్న చిన్నతనం లోనే… పెద్దయ్యాక తెలుసుకోవడం నేర్చుకోవడం అనేవి ఏమీ ఉండవు. మీకు తెలుసు కదా మొక్కగా ఉన్నప్పుడు వంగనిది మను అయ్యాక అసలే వంగదు…