ఫ్రీ వైఫై కోసం కన్నకూతురుకు అలాంటి పేరు పెట్టిన తల్లితండ్రులు!

Share

తల్లి తండ్రి తన పిల్లలకు వారి కుటుంబంలో పెద్ద వారి పేర్లను, లేదా ఇంటి దేవుడు కలిసివచ్చే పేర్లను, లేదా ఇప్పుడు సరికొత్తగా తల్లి, తండ్రి పేరు కలిసేటట్టుగా ఒక కొత్త పేరును తమ పిల్లలకు పెట్టుకోవడం జరుగుతుంది. మరికొందరైతే ఏదైనా ప్రత్యేకమైన రోజులలో పుడితే వారికి ఆ సందర్భాన్ని బట్టి పేర్లను నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ ఒక జంట తమ కూతురికి పెట్టిన పేరును అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉచిత వై_ఫై కనెక్షన్ కోసం ఆ జంట వారి కూతురికి ఇంటర్నెట్ ప్రొవైడర్ పేరును పెట్టడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం.

స్విట్జర్లాండ్ కు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ ట్విఫి కంపెనీ ఎవరైనా తమకు పుట్టబోయే పిల్లలకు ఆ కంపెనీ పేరు పెడితే వారికి సంవత్సరాల తరబడి ఉచితంగా వై_ఫై కనెక్షన్ ఇవ్వబడుతుందని ప్రకటించింది. అబ్బాయికి లేదా అమ్మాయికి కానీ ఆ కంపెనీ పేరు కలిసొచ్చేలా ‘ట్విఫియా’, లేదా ‘ట్విఫస్’అని పేర్లు పెడితే ఏకంగా 18 సంవత్సరాల పాటు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని పేర్కొనబడింది.

ఈ పేరు పెట్టిన తల్లిదండ్రులు అమ్మాయి లేదా అబ్బాయి ఫోటో, బర్త్ సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే వాటిని నిర్ధారించుకున్న తర్వాత ఆ కుటుంబానికి ఉచితంగా వై_ఫై కనెక్షన్ ఇవ్వనున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు.
ఈ ప్రకటన ఓ యువజంట ఫేస్ బుక్ ద్వారా చూసి వారికి పుట్టిన పాపకు ‘ట్విఫియా’, అనే పేరును పెట్టారు. దీంతో వారు ఉచితంగా వైఫై కనెక్షన్ పొందారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ కనెక్షన్ ద్వారా ఆదా అయ్యే డబ్బును మా పాప పేరిట బ్యాంకులో జమ చేస్తామని. తదుపరి ఏవైనా అవసరాలకు ఆ డబ్బులు వినియోగించుకోవచ్చని తెలిపారు. కాకపోతే పాప తల్లి మాట్లాడుతూ మొదట పాపకు ఈ పేరు పెట్టడం ఎంతో ఇబ్బందిగా అనిపించింది. ఉచితంగా వచ్చే వైఫైకోసం పాపకి పేరు పెట్టడం వల్ల పాపను అమ్మేసినట్లు భవిష్యత్తులో కొన్ని నిందలు భరించాల్సి వస్తుందేమోనని, దీనిని ఎదుర్కోవడానికి భయమేస్తోంది అని ఆమె తెలిపారు.

ట్విఫి వ్యవస్థాపకుడు ,సీఈవో ఫిలిప్ ఫోష్ మాట్లాడుతూ పాపకు ఆ పేరు పెట్టినందుకు ఎంతో గర్వ కారణంగా ఉంటుందని తెలిపారు. ఒకవేళ మా కంపెనీ మూసివేసిన ఆ తల్లిదండ్రులకు మాత్రం ఉచితంగా వై_ఫై కనెక్షన్ ఇవ్వబడుతుందని ఆయన తెలియజేశారు. ఇంకా కొత్త జంటలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ట్విఫి వ్యవస్థాపకుడు ఈ సందర్భంగా తెలియజేశారు.


Share

Related posts

అమెరికా కొత్త అధ్యక్షుడు కి కంగు తినిపించిన కిమ్..!!

sekhar

ఆసీస్ ఆలౌట్ 151

Siva Prasad

బిగ్ బాస్ 4: అందుకే సీక్రెట్ రూమ్ లోకి అఖిల్ వెళ్ళాడా..??

sekhar