అనంతపురం: దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం నెలకొంది. రవి తండ్రి కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇకలేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4:00గంటలకు వెంకటాపురం గ్రామంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
https://www.facebook.com/SreeramParitalaOfficial/photos/a.1695345090790593/2484077951917299/?type=3&eid=ARBYWeI61wKwnrXegtxKRmkTz9mo3DTiA4BpIZKWnDi9i2-g3qiwljm0xn6wFS4ORoIYWU0MY4TgwSLV&__xts__%5B0%5D=68.ARAc396KdYub4u0IQtyLyVl0T4kIZ7wWOpHbc3S2nRyKeVA_Gry7LWI4K9d-ecuix818MvBtrk3Ma5OgAnWVwWdI00i181aoyrST7dEpSdb_zuYQPs50Vbru_wc0_CMOBdlBDrmOLZmNZxnWe4YkZFTlHsi3GZ1tvlgjMerd5HY5r_VRM9qZOWixLdRz-mk9Vbxn-DOskt87SdG8yj5a0srevBsf9kAEd1LfKNM8EaPYrp21rAN4lwzZMBciFFuO-KAshWB5W3oM3EsFLAGseZhyPa0FPYi7FfKsrk8ddpSyjKK_wNW26K7qs1z8nG4HKwGsQ2O7TLjOH5w7_6_GWQqrh4B5&__tn__=EEHH-R