Parrot: ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం చిలకలను పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిలుకలు ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఇంట్లో సానుకూలత వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఇంట్లో చిలకల చిత్రాన్ని పెట్టుకున్నా కూడా మీ అదృష్టాన్ని మార్చేవిగా ఉంటాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే చిలకల చిత్రాలను పెట్టేటప్పుడు సరైన వాస్తు దిశలోనే పెట్టాలని చెప్పబడింది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న, వాటి నుండి బయటపడడం కోసం చిలుకల చిత్రాలను ఉంచుట మంచిదని చెప్పబడింది.

చిలుకలు ఇంట్లో ఉన్న సమస్యలను దూరం చేయడంలోనూ, నెగిటివ్ ఎనర్జీ ని పోగొట్టడంలోని ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తర దిశలోనే చిలకల చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల స్టడీస్ రూమ్ లో ఉత్తర దిశలో చిలకల చిత్రాలను పెట్టినట్లయితే పిల్లలు విద్యలో రాణిస్తారు.చిలుకలను పెంచుకోవడం వలన మన ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని అంతేకాకుండా శుభాలు కలుగుతూ ఇంట్లో నీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. ఇక చిలుకలను ఇంట్లో పెంచుకునేవారు వాటికి స్వీట్ చాహితమైన వాతావరణాన్ని కల్పించాలి.
భార్యాభర్తల మధ్య ఏవైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు తొలగిపోవడానికి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి చిలకల జంట చిత్రాలను బెడ్ రూమ్ లో పెంచడం మంచిదని సూచించబడింది. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగి ప్రేమ మరింత బలపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పచ్చని రంగుతో కిలకిల రావాలతో సందడి చేసే చిలుక మనకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా వాస్తు పరంగాను చాలా మేలు చేకూరుస్తుంది. చిలకల చిత్రాలు గాని చిలకల బొమ్మలు గాని ఇంట్లో పెట్టుకుంటే రాహువు, కేతువు, శని దోషాల నుండి చెడు దృష్టి నుండి కొంతమేర ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరికీ అకాల మరణం సంభవించదని సూచిస్తున్నారు. ఇంటికి ఇన్ని శుభాలు చేకూర్చే చిలకలను పెంచుకున్న, చిలకల చిత్రాలను పెట్టుకున్న అంతా మంచే జరుగుతుంది…