NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

Supreme Court: ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల  కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబు, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరో సారి వార్తా పత్రికల ద్వారా బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటనలు ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండో సారి. సైజు విషయంలో సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో క్రితం రోజుతో పోలిస్తే మరింత పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి కోర్టు దిక్కరణ కేసులో బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ..దేశ వ్యాప్తంగా 67 పత్రికల్లో ఆ ప్రకటనలు ఇచ్చామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పలు ప్రశ్నలు సంధించింది. క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా..? గతంలో మీ ఉత్పత్తుల ప్రకటనలో ఉపయోగించిన ఫాంట్ సైజునే వాడారా ..? అంతే పరిమాణంలో క్షమాపణలను ప్రచురించారా ? అని ప్రశ్నించింది.

దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరో సారి ప్రచురిస్తామని రోహత్గీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరో సారి వార్త పత్రికల్లో క్షమాపణలు తెలియజేశారు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 30వ తేదేకి ధర్మాసనం వాయిదా వేసింది. పతంజలి కోర్టు దిక్కార అంశాన్నీ అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను రెండు రోజుల్లో కోర్టుకు సమర్పించాలని, అలానే వాటి ప్రతులను కూడా పిటిషనర్లకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఆధునిక వైద్య విధానంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు గత ఏడాది నవంబర్ లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవని అప్పట్లో సంస్థ తరపున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ వాటిని ఉల్లంఘించడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే రాందేవ్ బాబు, బాలకృష్ణ పలు మార్లు కోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. అయితే వాటిని అంగీకరించడం లేదనీ, చర్యలకు సిద్దంగా ఉండాలని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో రెండు రోజులుగా పత్రికల్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చింది పతంజలి సంస్థ.

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N