బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వకన్నముందే.. హెడ్‌డీ ప్రింట్‌తో ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్‌లలో అందుబాటులో వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఆన్‌లైన్‌లో సినిమా లీక్ అవ్వడం వల్ల చిత్ర యూనిట్‌కు రూ.కోట్లల్లో నష్టం రానుంది. దాదాపు నాలుగేళ్లుగా ‘పఠాన్’ మూవీ కోసం షారుఖ్ ఖాన్ ఫాన్స్ వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసింది. కానీ చివరకు నిరాశే మిగిలిందని చెప్పుకోవచ్చు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘పఠాన్’ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా నటించారు. జనవరి 25న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. దానికి ముందుగానే కొన్ని వెబ్‌సైట్స్ లో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, ఫిల్మీ4వాప్, ఎంపీ4మూవీస్, పాగల్ వరల్డ్, వేగమూవీస్ వంటి వెబ్‌సైట్లలో దర్శనమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం ఆన్‌లైన్ లీక్ అయిన తర్వాత దాదాపు కోట్లల్లో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌లో సినిమాలు తొలగించడానికి మేకర్స్ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, ఫిల్మీ4వాప్, ఎంపీ4మూవీస్, పాగల్ వరల్డ్, వేగమూవీస్ వంటి అనేక వెబ్‌సైట్లలో పఠాన్ మూవీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నెటిజన్లు ఆయా సైట్లను సందర్శించి సినిమాను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే కోట్లల్లో నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుక్ మై షో అందించిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి 10 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సోమవారం నాడు ఐనాక్స్ సినిమాస్‌లో 2.75 లక్షల టికెట్లు బుక్ అయినట్లు ఐనాక్స్ తన ట్విట్టర్ అకౌంట్ పేజ్‌లో అధికారిక ప్రకటన చేసింది. ‘దేశంలోని అన్ని ఐనాక్స్ థియేటర్లలో మొదటి వారం వరకు పఠాన్ మూవీకి 2.75 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. 2023లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి. డోంట్ మిస్‌ది క్రేజ్.’ అని ట్విట్‌లో చెప్పుకొచ్చింది.

పఠాన్‌కు అన్ని కష్టాలే..
మొదటి నుంచే పఠాన్ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటివరకు పఠాన్ సినిమాలోని ‘బేషరమ్’ సాంగ్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఈ సాంగ్‌లో దీపికా పదుకొణె బోల్డ్ కనిపించిందని, అలాగే కాషాయం డ్రెస్ ధరించి ఆ సాంగ్‌లో నటించిందని భారీగానే వ్యతిరేకించారు. సాంగ్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని హిందువులు, బీజేపీ నేతలు డిమాండ్ కూడా చేశారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొన్న పఠాన్ టీమ్‌కు ఇప్పుడు లీక్ సమస్య వచ్చి పడింది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడుతుందో? ఎంత నష్టాన్ని చవి చూస్తుందో వేచి చూడాలి.
ఇప్పటివరకు లీక్ అయిన పెద్ద సినిమాలు..
సినీ పరిశ్రమకు లీకుల బాధ తప్పడం లేదనే చెప్పుకోవచ్చు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా లీక్ అయ్యాయి. రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో విడుదలై.. మేకర్స్ కు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్య అన్ని ఇండస్ట్రీలోనూ ఉంది. ఈ మధ్యకాలంలో భీమ్లా నాయక్, వారసుడు, అవతార్-2, ఆర్ఆర్ఆర్, లవ్‌స్టోరీ, పుష్ప, బీస్ట్, సర్కారు వారి పాట, అరవింద సమేత వంటి సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవ్వకముందే లీక్ అయ్యాయి. కానీ ఎప్పటికప్పుడు మేకర్స్ స్పందించారు. అన్ని వెబ్‌సైట్స్ లలో సినిమాలను తొలగించేందుకు ప్రయత్నించారు.