NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పీకల వరకు వస్తేనే పవన్ స్పందిస్తారా?? కమిటీలు ఇప్పుడు గుర్తు వచ్చాయా?

 

 

పీకల వరకూ వస్తేగాని ఊపిరి తీసుకున్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి…. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీల నియామకం కి పర్యటనలకు తాపీగా ఇప్పుడు కమిటీ వేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పొత్తులో భాగంగా సీటు ఆశిస్తున్న జనసేన పార్టీ ఇప్పటి వరకు కళ్ళు తెరుచుకోకపోవడం విడ్డూరం విశేషం… ఇప్పుడు అత్యవసరంగా లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి చాటుకునేందుకు, కమిటీలు వేయాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా వేసిన పార్టీ నాయకులు సమన్వయ కమిటీ ద్వారా తమకు తిరుపతి లోక్సభ సీటు కేటాయించేలా చూడాలని బీజేపీ నాయకులకు సంకేతం ఇచ్చినట్లయింది… దీంతోపాటు ఇప్పటివరకు తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కు కనీసం కార్యవర్గం నాయకులు లేని పవన్ ఒప్పుకున్నట్లు అయింది..

పట్టున్న నాయకులేరి??

పవన్ తాజాగా లోక్సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు నిర్మించాలని పర్యటనలు చేయాలని వేసిన కమిటీ లో కూడా పెద్ద నాయకులు కనిపించడం లేదు. కమిటీలో ఉన్న నాయకులు ఎవరు పక్క నియోజకవర్గంలో వారికి కూడా తెలియని వారు. వీరు ఏడు నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తారు ఏం చేయబోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. కమిటీలో ఉన్న 10మంది లో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఒక్కరే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నారు. అలాగే మదనపల్లికి చెందిన రాందాస్ చౌదరి దీంట్లో వేయడం ద్వారా ఓ సీనియర్ కు బాధ్యతలు అప్పజెప్పి నట్లయింది. మిగిలిన ఎనిమిది మంది నియోజకవర్గ స్థాయి నాయకులు. పక్క నియోజకవర్గానికి తెలియని వారు. మరి వీరు ఆయా నియోజకవర్గాల్లో ఏం చేయబోతున్నారు?? ఎలా సమన్వయ పరుస్తారు?? అనేది అర్థం కానీ ప్రశ్న.

కమిటీలు కాదు కార్యకర్తలు లేరు!!

జనసేన పార్టీకి తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులే కాదు కనీసం కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు సైతం లేరు. ఎస్సీ నియోజకవర్గాల సత్యవేడు సూళ్లూరుపేట ప్రాంతాల్లో కేవలం పవన్ కళ్యాణ్ వస్తే చూడ్డానికి వచ్చే వారి తప్ప నాయకులు వస్తే పార్టీ కోసం పని చేసేందుకు కార్యకర్తలు కనిపించరు. గంగాధరనెల్లూరు పార్టీ బాధ్యతలు చూస్తున్న పొన్నం యుంగంధర్ మాత్రమే ఎస్సీ నాయకుడు. ఆయన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మాత్రమే తెలుసు. అందులోనూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తిరుపతి లోక్ సభ పరిధిలోకి రాదు. ఎస్సీ నియోజకవర్గం సమన్వయ కమిటీ లో జనసేన పార్టీ తరఫున ఎస్సీ నాయకులు లేకపోవడం గమనార్హం. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉంటాయి. మరి ఇక్కడ ప్రస్తుతం పార్టీ జండా మోసే వారు కరువయ్యారు.

బిజెపికి ఏం చెప్పదలుచుకున్నారు??

జనసేన సమన్వయ కమిటీ వేసి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు అత్యవసరంగా నియమించాలని పవన్ చెప్పడం ద్వారా బిజెపికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది.. తాము సైతం పోటీలో ఉన్నామని, పవన్ బిజెపి కు చెప్పదలుచుకున్నారు అని ఇటీవల పవన్ పర్యటనకు వచ్చినప్పుడు ఏడు నియోజకవర్గాల్లో కనీసం కమిటీలు కూడా లేని విషయాన్ని గుర్తించినట్లు తెలిసింది. అక్కడ కచ్చితంగా కమిటీలు ఉండి పార్టీకి జవసత్వాలు ఉంటేనే బీజేపీ టికెట్ అడగడానికి బాగుంటుంది అనేది జనసేన పార్టీ చీఫ్ అభిప్రాయం.

అసలు క్యాండెట్ ఎవరు??

జనసేన పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక టికెట్లు బిజెపి కనుక ఇస్తే అసలు జనసేన తరపున పోటీ చేసేది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎస్సీ నాయకులు లేరు. లోక్ సభ అభ్యర్థిత్వానికి పోటీ పడేంత ఆర్థిక స్తోమత ఉన్న నాయకులు కరువే. మరి ఇప్పుడు జనసేన కు టికెట్ కేటాయిస్తే వేరే నియోజకవర్గం నుంచి లేదా ఇతర పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చి అభ్యర్థిగా పెడతారా అనేది బిజెపి నాయకుల ప్రశ్న. బిజెపి కు ఓ పక్క ఓ మాజీ ఐఏఎస్ అధికారి అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నాయకులతో ను మంచి సంబంధాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బిజెపికి టికెట్ ఇస్తే కనుక ఆయనే అభ్యర్థి అవుతారు. మరి జనసేన పార్టీ తరపున ఏ నాయకుడు ఉంటారు అనేది అర్థం కాని అయోమయం. ఇటీవల పవన్ కళ్యాణ్ సభలో పదిమంది వరకు నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అని చెప్పిన దానికి తగినట్లుగా ఎవరు కనిపించని పరిస్థితి ఉంది.

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju