NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సూప‌ర్ ట్విస్ట్‌… అసెంబ్లీతో పాటు పార్ల‌మెంటుకు ప‌వ‌న్ పోటీ.. సీటు ఛేంజ్‌..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. తొలి జాబితాలో పవన్ 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే భీమవరం నుంచి పవన పోటీ చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో పవన్ భీమవరం తో పాటు గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి భీమవరంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పవన్ భారీ మెజార్టీతో గెలుస్తారన్న భారీ అంచనాలు ఉన్నాయి. సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇలాంటి టైంలో తొలి జాబితాలో భీమవరం నుంచి పవన్ పేరు లేకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అనూహ్యంగా భీమవరంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జనసేన జెండా కప్పుకున్నారు. ఆయనే అక్కడ జనసేన నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. ప‌వ‌నే స్వ‌యంగా తాను భీమ‌వ‌రంలో పోటీ చేయ‌క‌పోతే త‌న‌ను పోటీ చేయ‌మ‌ని అడిగార‌ని అంజిబాబు చెప్పుకున్నారు. ఆయ‌న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు స్వ‌యానా వియ్యంకుడు. భీమవరంలో కాపు సామాజిక వర్గంతో పాటు క్షత్రియ, శెట్టిబలిజ ఇతర బీసీ కులాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

అందుకే పవన్ భీమవరం కంటే కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు 80 వేలకు పైగా ఉన్నారు. పైగా 2009లో ఇక్కడ ప్రజారాజ్యం విజయం సాధించింది. గత ఎన్నికలలో జనసేనకు ఇక్కడ భారీగా ఓట్లు లభించాయి. ఈ క్రమంలోనే పవన్ భీమవరం కంటే పిఠాపురం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పైగా కాకినాడ పార్ల‌మెంటు సీటు నుంచి కూడా జ‌న‌సేన పోటీలో ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పవన్ అనకాపల్లి నుంచి పార్లమెంటు బరిలో కూడా ఉంటారని జనసేన వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో చేరతారా ? లేదా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే క్రమంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉండేందుకు ఇష్టపడతారా అన్నది స్పష్టం కానుంది. వాస్తవంగా అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగింది. గత రెండు రోజుల నుంచి నాగబాబు పేరు క్రమంగా వెనకకు వెళుతుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ నుంచి ప‌వ‌న్‌ పోటీ చేసే ఆలోచనలో ఉండటమే అని తెలుస్తోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju