NewsOrbit
న్యూస్

నాదెండ్ల విషయం లో పవన్ కల్యాణ్ ఫాన్స్ లో భిన్న అభిప్రాయాలు !!

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించటం కొందరు జన సైనికులకే నచ్చడం లేదు . టీడీపీ వాళ్ళు అవినీతిలో ఇరుక్కుని అరెస్ట్‌ అయితే మనకేంటి సంబంధం.? అదేమైనా స్టేట్‌ సమస్యా.? మన పార్టీ సమస్యా.?’ అంటూ జనసైనికుడొకరు స్పందించారు , అతని స్పందన కరక్ట్ గా లేదని మరికొందరు జనసేన సపోర్టర్ లు ఖండిస్తున్నారు.. ఆ ప్రకటన క్యాడర్‌ని గందరగోళానికి గురిచేసేలా వుంది’ అని అదే జనసైనికుడు అనడం తో వ్యవహారం కాస్త సీరియస్ గా మారింది.  అచ్చెన్నాయుడు అరెస్టు కాగానే జనసేన 


పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ పేరుతో ఓ పత్రికా ప్రకటన వచ్చింది. అందులో, అచ్చెన్నాయుడి అరెస్ట్‌ని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు కూడా. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెబుతూనే, అరెస్టులు కుట్ర పూరితంగా వుండకూడదని మాత్రం జనసేన అభిప్రాయపడింది. అయితే, ఈ ప్రెస్‌నోట్‌పై జనసైనికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ప్రెస్ నోట్ వల్ల జనసేన టీడీపీ బి-టీం అని, జనసేన కి ప్యాకేజీ అందింది అని వైసీపీ చేసే ప్రచారానికి పార్టీనే అనవసరం గా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని కొంతమంది జనసైనికులు వాదిస్తున్నారు , మరికొందరు ఇదే సరైన పద్దతి అంటున్నారు.  అందుకేనేమో, సాయంత్రానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేరుతో ఇంకో ప్రకటన వచ్చింది. ‘మనకు బీజేపీతో తప్ప ఎవరితోనూ పొత్తు లేదు..’ అని పవన్‌ కళ్యాణ్‌ ఆ ప్రకటనలో స్పష్టతనిచ్చారు.  లాజికల్ గా చూస్తే నాదెండ్ల ద్వారా వచ్చిన మాటలు పెర్ఫెక్ట్ గానే ఉన్నాయి. అరస్ట్ అన్యాయం అని చెబుతూనే , ESI స్కామ్ విషయం అన్నీ విషయాలూ బయటకి లాగడం ఇంపార్టంట్ అన్నారు ఆయన .. దానికే జనసైనికుల్లో కొందరికి కోపం రావడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. 

మరొక పక్క .. ఇదిలా వుంటే, జనసేన నేత నాగబాబు, తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన విధంగా ట్వీట్‌ చేశారు. ‘టీడీపీ హయాంలో టీడీపీ నాయకురాలిని సోషల్‌ మీడియాలో ఏదో అన్నారని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి, వాళ్ళని గొడ్డును బాదినట్లు బాది, అంత హింస పెట్టిన టీడీపీ,
పాపం అంత తేలిగ్గా పోతుందా.? మీరు మా జనసైనికులకు చేసింది అంత తేలిగ్గా మర్చిపోం..’ అని నాగబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.ఇది కూడా బాలయ్య నాగబాబులు మధ్య వైర౦లోంచి పుట్టిన ట్వీటే నని చెప్పవచ్చు.



author avatar
Yandamuri

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju