ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం

విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు  పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు కార్యాలయానికి చేరుకున్నారు.

విజయవాడ కేంద్రంగా 2019 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు పవన్ తెలిపారు. జన సైనికులు ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేయాలనీ, అవినీతి రహిత పాలన కోసం అందరూ కృషి చేయాలనీ  పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

‘ఏపికి బంగారు భవిష్యత్తు ఉండాలి, అందుకోసం జనసేన పని చేస్తుంది, నేటి నుండి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాను’ అని పవన్ ప్రకటించారు