వకీల్ సాబ్, రాధేశ్యామ్ సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోటీ పడబోతున్నారా ..? అవుననే అంటున్నారు సినిమా వర్గాలు. ఈ పోటీ న్యూ ఇయర్ లోనే మొదలైపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా మిడ్ నైట్ 12 గంటలకి వకీల్ సాబ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ ల లుక్ రిలీజ్ చేస్తే రాధేశ్యామ్ నుంచి ప్రభాస్ .. విక్రమాదిత్య లుక్ ని రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రాబోతున్న పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తుండటం తో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ రూపొందగా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. అంతేకాదు తాజాగా రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ – శృతిహాసన్ పోస్టర్ లో సంక్రాంతికి టీజర్ అని కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అంటే ఈ నెల 14 లేదా 15 న వకీల్ సాబ్ టీజర్ రాబోతోంది.
ఇక ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి కూడా టీజర్ ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం ఇందుకు జనవరి 14 న డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ చెల్లి ప్రశీద నిర్మాతగా మారుతోంది. ఇక వకీల్ సాబ్ ఏప్రిల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ రాధేశ్యామ్ కూడా అన్ని అనుకున్నట్టు పూర్తైతే అదే నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు.