‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ లో పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ లని నటించమని చెప్పిన వాళ్ళు సూపర్.. !

Share

పవన్ కళ్యాణ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ వకీల్ సాబ్. శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తునడగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పిస్తున్నారు. శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటించనుంది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.సి.ఎ ఫేం వేణు శ్రీరాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా కేవలం 15 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో ఈ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ నవంబర్ 1 వ తేదీ ఉంచి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Pawan Kalyan to star in 'Ayyappanum Koshiyum' Telugu remake, Venky Atluri to direct | The News Minute

కాగా రీసెంట్ గా మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ లో నటించబోతున్నట్టు ప్రకటించాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్, సర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న మరో క్యారెక్టర్ రానా దగ్గుబాటి చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

అంతేకాదు పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ .. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా మెగా న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ నటిస్తే అద్భుతంగా ఉంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారట. చెప్పాలంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – రాం చరణ్ నటించే ఆస్కారం కథ లో ఉంది. ఆచార్య లో మెగాస్టార్ తో కలిసి నటించబోతున్న రాం చరణ్ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ లో బాబాయ్ పవన్ కళ్యాణ్ తో నటిస్తే పెద్ద రికార్డ్ గా మిగిలిపోతుందని ఇండస్ట్రీలో రికార్డుల మోతే అని చెప్పుకుంటున్నారట. మరి ఈ విషయం ఇద్దరు ఆలోచిస్తే బావుంటుంది.


Share

Related posts

కేసీఆర్ పై కొత్త గేమ్ మొద‌లుపెట్టిన బీజేపీ?

sridhar

KTR : టీఆర్ఎస్ నేత‌ల‌పై కేటీఆర్ ఫైర్‌… ఎందుకో తెలుసా?

sridhar

Kalyan ram : కళ్యాణ్ రామ్ సినిమాల విషయంలో క్లారిటీ ఏది..?

GRK