Mahesh Pawan: మహేష్ బాబు ఫ్యామిలీ కి పవన్ కళ్యాణ్ గిఫ్ట్..!!

Share

Mahesh Pawan: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు హీరోల సినిమా లకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. ఇక ఓపెనింగ్స్ అయితే చూసుకో అవసరం లేదు. వేల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మిగతా సినిమాలు పక్కకు వెళ్లాల్సిందే. ఫ్లాప్ అయినా గాని కలెక్షన్ల పరంగా.. నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఇద్దరికిద్దరూ నువ్వానేనా అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తారు. ఇదిలావుంటే ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తెరకెక్కుతోన్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోల జోరు కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో ఉండటంతో దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. గత ఏడాది వకీల్ సాబ్(Vakeel Saab) సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం  సర్కారు వారి పాట సినిమా చేస్తూనే రాజమౌళి(Rajamoulli) సినిమాని లైన్ లో పెట్టడం జరిగింది. కాగా ఇద్దరు హీరోలు ప్రస్తుతం.. ఒప్పుకున్న సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Pawan Kalyan Send Diwali Gifts To Mahesh Babu ANd His Family - Sakshi

కాగా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలకు మంచి సన్నిహిత సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో ఈ ఇద్దరు హీరోలు నటిస్తే చూడాలని .. వీరిద్దరి కలయికలో మల్టీస్టారర్ సినిమా రావాలని ఇద్దరు హీరోల అభిమానుల తో పాటు సామాన్య ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తోటి హీరోలకు అప్పుడప్పుడు బహుమతులు పంపిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మహేష్ బాబు ఫ్యామిలీ కి బహుమతులు పంపడం జరిగింది. కాలుష్య నివారణ క్రాకర్స్ తో పాటు స్వీట్ బాక్స్.. మహేష్ బాబు కి పవన్ పంపారు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అన్నా లెజ్ నోవా.. థాంక్స్ అంటూ కూడా నమ్రత వాళ్ళు పంపిన గిఫ్ట్ బాక్స్ పోస్ట్ చేసి.. ఫోటో పెట్టడం జరిగింది.

పూరి జగన్నాథ్ మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో

ఒక్క పండుగకు మాత్రమే కాక పవన్ కళ్యాణ్ స్వయంగా తాను పండించే పంటలకు సంబంధించిన.. ఫ్రూట్స్ వంటి వాటిని కూడా తనకి క్లోజ్ గా ఉండే ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు పంపడం జరుగుతుంది. కాగా ఇదే రీతిలో దీపావళి పండుగనాడు మహేష్ బాబు ఫ్యామిలీ తో పాటు డైరెక్టర్ క్రిష్ ఫ్యామిలీకి కూడా..పవన్ బహుమతులు పంపటం జరిగిందట. ఏది ఏమైనా దీపావళి పండుగ నాడు పవన్ కళ్యాణ్.. మహేష్ ఫ్యామిలీ కి గిఫ్ట్ పంపటం.. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కృషి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అదేరీతిలో రానాతో “భిమ్ల నాయక్” సినిమా చేస్తూ ఉన్నారు. ఈ రెండు మాత్రమే కాక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. వీటి తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా పవన్ రానున్న రోజుల్లో సినిమాలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరోపక్క త్రివిక్రమ్ సినిమా కూడా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.


Share

Related posts

జగన్ దూకుడు కి బెదిరిపోయిన కేసీఆర్..? అందుకే మీటింగ్ కి డుమ్మా?

arun kanna

ఊహించని మలుపు : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన జగన్ ??

sekhar

Hyderabad City Police : దుమ్మురేపుతున్న బ్రహ్మనందం మీమ్స్ వీడియో.. ఒక్కసారైనా చూడాల్సిందే..

bharani jella