2019 ఎన్నికలలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా రాపాక వరప్రసాద్ రికార్డు సృష్టించారు. పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు రెండు చోట్ల ఓడిపోయినా గాని రాపాక తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో గెలవడంతో పార్టీ పరువు కాపాడుకున్నటు అయింది. కాగా జనసేన తరఫున గెలిచిన గాని రాపాక వరప్రసాద్ కి ఆ పార్టీ నుండి పెద్దగా గౌరవ మర్యాదలు ముందు నుండి దక్కకపోవడంతో ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే పనులను బహిరంగంగానే పొగుడుతూ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించే రీతిలో రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళితే తాను వైసిపి కార్యకర్త నే అంటూ కుండ బద్దలు కొట్టినట్టు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి సీఎం జగన్ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే.. మీకు అభ్యంతరం ఏంటి? అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీ ఈ కార్యక్రమంలో పాల్గొని వైసిపి కార్యకర్తలను ఉద్దేశించి రాపాక వరప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులను మాత్రమేకాక జనసేన హైకమాండ్ కి పిచ్చ కోపం తెప్పించిన టు అయింది. దీంతో రాబోయే రోజుల్లో రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం పలు కామెడీ షోలకు బడ్జిగా వ్యవహరిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు సీరియర్స్…