NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సేమ్ టూ సేమ్ అదే ఫార్ములాని వాడేస్తున్న ప‌వ‌న్..!!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి 2019 ఎన్నిక‌ల్లో అనుస‌రించిన ఫార్ములానే అనుస‌రించ‌నున్నా రా? గ‌త ఎన్నిక‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం మేరకే ఇప్పుడు కూడా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. అయితే.. రెండు స్థానాల్లోనూ బ‌ల‌మైన పోటీ ఇచ్చినా.. ఓడిపోయారు. గాజువాడ‌, భీమ‌వ‌రం లో కాపుల ఓట్లు త‌న‌కు ప‌డ‌తాయ‌ని అనుకున్నారు.

అంతేకాదు.. యువ ఓట‌ర్లు, అభిమానులు కూడా త‌న‌వెంటే ఉన్నార‌ని వారి ఓట్లు కూడా త‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌ని భావించారు. కానీ, వైసీపీ దూకుడు, జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు ముందు కు సాగ‌లేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కేవ‌లం ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేయాల‌ని అనుకున్నారు. అది కూడా దాదాపు కాపులు 90 శాతం ఓటు బ్యాంకు సొంతం చేసుకున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నట్టు స‌మాచారం.

దీనిని సంబంధించి సుదీర్ఘ స‌మాలోచ‌న‌లు కూడా చేశారు. ముఖ్యంగా చంద్ర‌బాబుతోనూ ఆయ‌న చ‌ర్చిం చారు. క్షేత్ర‌స్థాయి నుంచినివేదిక‌లు తెప్పించుకున్నారు. పిఠాపురం నాడిని ప‌ట్టుకునేందుకు కాకినాడ టూర్‌లో ఎక్కువ‌గా ఇక్క‌డి విష‌యాల‌పైనే ఫోక‌స్ పెట్టారు. దీంతో ప‌వ‌న్ ఇక్క‌డ నుంచిపోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. అయితే..తాజాగా ప‌వ‌న్ రూటు మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల కాపు అగ్ర‌నేత‌లు.. సంధించిన లేఖ‌ల‌ను ముందు లైట్ తీసుకున్నా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం వాటిలోని అంశాల‌పై ప‌వ‌న్ సీరియ‌స్‌గానే దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో త‌న‌ను ఓడించేందుకు వైసీపీ ఏ మైనా చేస్తుంద‌ని ఆయ‌న ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా.. మ‌ళ్లీ రెండు నియోజ‌క వ‌ర్గాలను ఎంచుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యంపై జ‌న‌సేన వ‌ర్గాలు కూడా గుస‌గుస‌లాడుతు న్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు కాకినాడ రూర‌ల్‌, లేదా సిటీ నుంచి, పిఠాపురం నుంచి ప‌వ‌న్ పోటీ చేయొచ్చ‌ని తెలుస్తోంది

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju