Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో పరంగా కంటే ఆయన వ్యక్తిత్వనీ చాలామంది బాగా ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ కి అభిమానులు అదే రీతిలో నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ వరుసలో ముందుండే వ్యక్తి బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కి తాను వీరాభిమాని మాత్రమే అని కాకుండా భక్తుడిని పవన్ కళ్యాణ్.. నా దేవుడు అంటూ.. బండ్ల గణేష్ చాలా సందర్భాలలో సినీ వేదికలపై తెలపడం జరిగింది.
అంతమాత్రమే కాకుండా తన సొంత బ్యానర్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీన్మార్ వంటి సినిమాలు చేయడం జరిగింది. ఈ రెండిటిలో గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ కి సరికొత్త పేరు సోషల్ మీడియా లో పెట్టడం జరిగింది.
Read more: Pawan Kalyan: నైజాం లో ఏ హీరో సృష్టించని రికార్డ్ ఫస్ట్.. పవన్ ఫ్లాప్ సినిమా సృష్టించింది..!!
గతంలో తాను పవన్ భక్తుడిని అని చెప్పుకునే బండ్ల తాజాగా.. పవన్ కళ్యాణ్ కి కొత్త పేరు పెట్టారు. నా దేవరా తో నేను… భక్త కన్నప్ప పరమేశ్వరుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ నీ దేవర అని పిలుచు కుంటున్నట్లు సోషల్ మీడియాలో స్పష్టం చేశాడు. దీంతో బండ్ల గణేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు.. బాస్ పై రోజు రోజుకి భక్తి పెరిగిపోతుంది అంటూ బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇస్తున్నారు. మరి కొంతమంది వీర భక్తుడు అంటూ.. తిరిగి కామెంట్లు పెడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వేదికలపై బండ్ల గణేష్ పవన్ ని ఉద్దేశించి నా దేవుడు.. అని అనకొండ నా దేవర అనే సరికొత్త స్టైల్ లో.. పలకరింపు ఉంటుందని బండ్ల పవన్ పై చూపిస్తున్న అభిమానానికి రకరకాలుగా రిప్లై ఇస్తున్నారు.