NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Bjp-Tdp-Janasena: టీడీపీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక పవన్..! ఎంత నిజం..?

pawan kalyan behind bjp counter to tdp

Bjp-Tdp-Janasena: బీజేపీ-టీడీపీ-జనసేన.. Bjp-Tdp-Janasena కూటమిపై మళ్లీ చంద్రబాబు ఆశలు పెట్టుకున్నట్టే ఉన్నారు. మహానాడులో.. ‘ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా అధికారపార్టీపై పోరులో భాగంగా విపక్షాలతో కలిసి వెళ్తాం. కేంద్రంలో బీజేపీకి విడతలవారీ మద్దతిస్తాం’ అని ఓ ప్రకటన చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. ‘ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే మోదీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మాకు జనసేనతో గట్టి పొత్తు ఉంది. వైసీపీ, టీడీపీలపై పోరు సాగిస్తాం’ అని సునీల్ దియోధర్.. ‘టీడీపీపాచికలు ఇక పారవు. జనసేనతో బలమైన పొత్తుతో కలిసి ఎన్నికలకు వెళ్తాం’ అని విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. దీని వెనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారా? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

pawan kalyan behind bjp counter to tdp
pawan kalyan behind bjp counter to tdp

బీజేపీ-జనసేన.. 2024 ఎన్నికలే లక్ష్యంగా తమ పొత్తు కొనసాగుతుందని గతంలోనే స్పష్టం చేశాయి. మొన్నటి తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం కలిసే వెళ్లారు. అయితే.. బీజేపీ తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేస్తే.. అధిష్టానం ఆఘమేఘాల మీద క్లియర్ చేసేసింది. ఇప్పుడంతా ఓకే. అందుకే చంద్రబాబు ఆలోచనను ఆదిలోనే గట్టిగా ఖండించి.. జనసేనతో మైత్రి బలమెంతో చెప్పింది. అయితే.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ వెనుక పనవ్ కల్యాణ్ ఉన్నారనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికీ టీడీపీ బీ-టీమ్ అనే ముద్రను జనసేన చెరుపుకోలేక పోతోంది. రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ-జనసేనకు ఒకరి మద్దతు మరొకరికి అవసరం. అందుకే టీడీపీతో సంబంధంలేని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీజేపీతో టీడీపీకి గట్టి కౌంటర్ పవన్ ఇప్పించారనీ చెప్పొచ్చు.

Read More:Tdp-Janasena: టీడీపీ-జనసేన ట్విట్టర్ వార్..! హ్యాష్ ట్యాగ్ లతో హల్ చల్..!!

బీజేపీ-జనసేనను వదులుకుని ఎంత నష్టపోయామో 2019 ఎన్నికల్లో చూసారు చంద్రబాబు. బీజేపీతో నాడు విభేధించి.. మోదీని విమర్శించి ఇటివల పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. 2014లో తమ మద్దతుతో గెలిచి.. తర్వాత దూరం పెట్టిన చంద్రబాబుని వీరూ మర్చిపోలేదు. తమను వాడుకుని టీడీపీ లాభపడుతోందని గ్రహించారు. అందుకే 2024 ఎన్నికలే లక్ష్యంగా వెళ్లాలన్నా.. తమ మైత్రిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఇప్పటినుంచే ఖచ్చితంగా ఉండాలి. అందుకే టీడీపీపై బీజేపీ ఈస్థాయిలో ఫైర్ అయిందని చెప్పాలి. అయితే.. పవన్ కు తెలీకుండా.. పవన్ ప్రమేయం లేకుండా బీజేపీ ఇంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని మాత్రం చెప్పలేం.

author avatar
Muraliak

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju