Bimla Nayak: మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పన్ కొషియం” సినిమా తెలుగులో “బీమ్లా నాయక్” గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బీజు మీనాన్, పృథ్వీరాజ్ కలసి నటించిన ఈ సినిమా అన్ని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల “బీమ్లా నాయక్” గ్లింప్స్ రిలీజ్ అవ్వడం తెలిసిందే. రిలీజ్ అయిన అతి తక్కువ గంటల్లోనే సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం మాత్రమేకాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది.
అయితే రిలీజ్ అయిన “బీమ్లా నాయక్” గ్లింప్స్ పరిశీలిస్తే మల్టీస్టారర్ అన్న మాదిరిగా కాకుండా పవన్ పాత్ర పేరు టైటిల్ గా పెట్టడం.. రానాకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం కనిపించింది. దీంతో రానా అభిమానులు… బల్లాల దేవ పాత్ర ఎలా ఉంటుందో.. అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.
మలయాళం సినిమా పరంగా చూసుకుంటే ఇద్దరు హీరోలకు సమాన వెయిటేజ్ కలిగిన స్టోరీ అయినా గాని… తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం బట్టి చూస్తే పవన్ మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి రానా నీ కొద్దిగా తక్కువ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. చిత్రీకరణ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి “బీమ్లా నాయక్” నిర్మాతలు సరి కొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.