NewsOrbit
న్యూస్

ఆ విషయంలో బాబు – పవన్ ఇద్దరిదీ ఒకటేమాట!

సాధారణంగా కరోనాని ప్రపంచం మొత్తం ఒక సమస్యగా చూస్తుంటే… ఏపీలో మాత్రం అది ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తానికి అదొక సమస్య.. కాని మాకు అది ఒక రాజకీయ అస్త్రం అన్నట్లుగానే ప్రతిపక్షాలు సైతం ప్రవర్తిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రం ఆర్ధికంగా కుదేలయినా కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వమే దాన్ని ఒకసాకుగా చూపని సమయంలో… ప్రతిపక్షాలు మాత్రం దాన్ని సాకుగా చూపి పతనమయిపోయాయని అంటున్నారు. ఆ సంగతులు అలా ఉంటే.. చాలా కాలం తర్వాత చంద్రబాబు – పవన్ లు ఒకేమాటపైకి వచ్చారు.

అవును… కరోనా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలో రోజురోజుకూ ఉధృతం అవుతున్న సమయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ అవివేకం అవుతుందనీ చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని, ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ క్షేమదాయకం కాదని బాబూ తెలిపారు. కాగా… అవినీతిపనులు, అక్రమాల చేష్టలు చేసినవారిని అరస్టులు చేస్తుంటే… కరోనాసమయమే దొరికిందా అని బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై చాలా కాలంగా స్థబ్ధగా ఉన్న పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతుండడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోందని, పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిసా, ఛత్తిస్ గఢ్‌ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని పవన్ సూచించారు.

మరి ప్రభుత్వం ఈ విషయంలో అయినా వీరి అభిప్రాయాణలను పరిగణలోకి తీసుకుంటుందా… కరోనాతో ఏమి ఆగాయి… ఇదీ ఆగదు అన్నట్లుగా ముందుకుపోతుందా అనేది వేచి చూడాలి!

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju