NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పోటీ చేసే స్థానాన్ని వెల్లడించిన పవన్ కళ్యాణ్ .. జనసేనాని అనూహ్య నిర్ణయం ..ఎందుకంటే..?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం తో పాటు గాజువాక నుండి పోటీ చేశారు. కానీ రెండు చోట్ల పరాజయం పాలైయ్యారు. అయితే గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ, ఓట్ల చీలక ప్రభావంతోనే రెండు చోట్ల ఓటమి పాలైయ్యారు. ఈ సారి 2014 ఎన్నికల కాంబినేషన్ లో అంటే టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిగా  ముందుకు వెళుతున్నందున అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టడం ఖాయంగా కనబడుతోంది.

Pawan Kalyan

ఈ క్రమంలో రెండు చోట్ల నుండి కాకుండా ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ అసెంబ్లీ నుండి పోటీ చేస్తారు అనే దానిపై రకరకాల ఊహగానాలు వినిపించాయి. అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కు పోటీ చేసి కేంద్ర మంత్రి అవుతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు పవన్ కల్యాణ్.

janasena and bjp fear to that media

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేసారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని పవన్ స్పష్టం చేశారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక, పిఠాపురం మూడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ నుండి పోటీ చేసినా గెలుపు ఖాయమనే పార్టీ అంచనాలు ఉన్నాయి. అయితే పిఠాపురం వైపే ఎందుకు మొగ్గు చూపారు అంటే.. ఈ నియోజకవర్గంలో దాదాపు 90వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఉంది.

ఇక్కడి నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడకేననీ, భారీ మెజార్టీ లభిస్తుందని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. అందుకే పవన్ పిఠాపురం నుండి పోటీకి సై అన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు కాకినాడ ఎంపీ సీటు కూడా దాదాపు జనసేనకే ఖాయమైంది. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ రూరల్, ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలుచుకోవచ్చని జనసేన భావిస్తొంది.

రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ను కూడా ఈ జిల్లా నుండే ప్రారంభించారు. ఆ సందర్భంలో రెండు రోజుల పాటు పిఠాపురంలో బస చేశారు. అక్కడ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తామని, ఇక్కడే ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. మరో పక్క కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద నాలుగు ఎకరాల్లోకి ఓ హెలిప్యాడ్ ను జనసేన రెండు నెలలకు లీజుకు తీసుకుంది. పిఠాపురం నుండి పోటీ చేసే ఉద్దేశంతోనే ముందుగా హెలిప్యాడ్ ను సిద్దం చేసినట్లు తాజా ప్రకటనతో అర్ధం అవుతోంది.

Breaking: కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్ బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju