రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడంతో తన పార్టీను నడపడానికి తిరిగి సినిమాల్లోకి రావాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ది. తన రీఎంట్రీ చిత్రంగా బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రీమేక్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వకీల్ సాబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత కాగా థమన్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ ఈ మధ్యనే తిరిగి మొదలైన విషయం తెల్సిందే.
హైదరాబాద్ లో వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. దసరా తర్వాత నుండి పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొంటాడని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డెడ్ లైన్ విధించుకున్నాడట. పవర్ స్టార్ వకీల్ సాబ్ లో లాయర్ గా కనిపించనున్న విషయం తెల్సిందే.
తన బ్యాలెన్స్ పోర్షన్ షూట్ కోసం కేవలం 20 రోజుల కాల్ షీట్స్ ను మాత్రమే ఇస్తానని వకీల్ సాబ్ నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీ హీరో. ఎందుకంటే వకీల్ సాబ్ కాకుండా దాదాపు నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు పవన్. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా చేయనున్నాడు. దాని తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. ఇవి కాకుండా మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో పవన్ నటించే అవకాశాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా 2023 కల్లా పవన్ కచ్చితంగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నికలకు సన్నద్ధమవ్వాలి. వచ్చే ఎన్నికలను మరింత పట్టుదలతో పాల్గొనాలని పవన్ డిసైడ్ అయ్యాడు. అందుకే వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తి చేయనున్నాడు. అందుకే వకీల్ సాబ్ కు కేవలం 20 రోజుల కాల్ షీట్స్ ను అందిస్తున్నాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!