Pawan kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెలియజేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి ఈ ప్రాజెక్టు పై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు రకరకాలుగా ఇమేజ్ లు ఎడిటింగ్ లు చేసుకుంటూ… సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ కి “గబ్బర్ సింగ్” వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటంతో… హరీష్ ఈసారి ఎటువంటి హిట్ ఇస్తాడో.. అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పైగా హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో.. అంచనాలు మరీ విపరీతంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా బద్రి సినిమా లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఎలివేషన్ సీన్స్ కట్ చేసి.. హరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మరోసారి పవన్ లో ఈ రేంజ్ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ ఆనాటి బద్రి సినిమాలో కొన్ని హైలెట్ సన్నివేశాలు వీడియో విడుదల చేసి.. ఒక్కసారిగా అభిమానుల్లో అంచనాలు మరింతగా పెంచేశాడు.
Read more: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అంత మాట అన్నందుకు చెంప చెళ్లుమనిపించిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!!
ఇక ఇదే రీతిలో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్… స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ అని.. మంచి ఎనర్జిటిక్ కంటెంట్ కలిగిన స్క్రిప్ట్ అని ఇటీవల తెలిపాడు. పవన్ అభిమానులకు మరో సారి పండగే అన్న రీతిలో pspk 28 గురించి చెప్పుకొచ్చాడు. ఒకపక్క హరీష్ మరోపక్క దేవిశ్రీప్రసాద్ ఈ కామెంట్లు చేయడంతో సెప్టెంబర్ మాసం నుండి సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కానున్న తరుణంలో.. అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.