NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కల్యాణ్ ఫాన్స్ కి వకీల్ సాబ్ కంటే పవర్ ఫుల్ టైటిల్ దొరికింది .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‘తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు, వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు కూడా. దీనికంతటికి కారణం 2024 ఎన్నికలట. ఆ సమయానికి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న పట్టుదలతో పవర్ స్టార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయితే ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలనే ప్రణాళికలో భాగంగా సుమారుగా నాలుగు చిత్రాల వరకు డేట్స్ ఇచ్చాడు.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel Saab' featuring Power Star

ఇకపోతే ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం‘వకీల్ సాబ్‘. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ లాయర్‌గా నటిస్తున్నాడు. నివేదా, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘వకీల్ సాబ్’తో పాటు పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా రోజులుగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఆ ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ ఆయన పుట్టినరోజున ఆ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. దీని ప్రకారం… క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒకటి, హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మరొకటి తెరకెక్కనున్నాయి. ప్రస్తుతానికి పవన్ ఒప్పుకున్న మూడు చిత్రాల్లో క్రిష్ తెరకెక్కించే చిత్రం చాలా ప్రత్యేకమని అనుకుంటున్నారు.

PSPK 28: Pawan Kalyan's Next Venture With Harish Shankar Is All About Love And Patriotism - Filmibeat

దీనికి కారణం ఈ మూవీ పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతుండడమే. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా… మొగల్ కాలం నాటి కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. కోహినూర్ వజ్రానికి సంబంధించిన కథను కూడా దీనికి జోడించారని సమాచారం. ఇకపోతే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటి వరకు పెద్ద కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. అసలే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనే ఆలోచనలో ఉన్న చిత్ర యూనిట్ ఇదివరకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకున్నారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ టైటిల్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Pawan Kalyan teams up with director Krish for period drama, pre-look poster out on his birthday - Movies News

తర్వాత సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ’ అనే పేరు పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం… క్రిష్, పవన్ కళ్యాణ్ ల మూవీకి మరోసారి టైటిల్ మార్చేశారట. ఇప్పటికే డివోషనల్ మూడ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ తన చిత్రానికి అదే టచ్ ఇచ్చాడన్న వార్త ఫిలిం వర్గాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న సమయంలో ఫిలిం చాంబర్‌లో దీని కోసం చిత్ర యూనిట్ ‘ఓం శివమ్’ అనే కొత్త టైటిల్‌ను రిజిస్టర్ చేయించడంతో అభిమానుల్లో సంబరాలు ఆకాశాన్ని అంటగా మా పవర్ స్టార్‌కు పవర్ ఫుల్ టైటిల్ దొరికింది.. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. మరి ఇది అధికారకంగా అనుకుంటున్న టైటిల్ ఆ లేక కేవలం ప్రచారనికేనా అన్నది కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N