పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తరువాత మళ్ళి ‘వకీల్ సాబ్’ సినిమాతో తెర మీదకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ గా నిలిచిన ‘పింక్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది అనుకున్నారు అభిమానులు. కానీ ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ను చూస్తుంటే ఈ చిత్రంలో భారీ మార్పులే చేసినట్లు అర్థం అవుతోంది.
మొదటిలో పవన్ కళ్యాణ్ అమితాబ్ క్యారెక్టర్ లో నటించనున్న వార్తలు వచ్చినప్పుడు అభిమానులు కాస్త నిరాశకు గురిఅయ్యారు. వారు ఆలా నిరాశకు గురిఅవ్వడానికి కారణం హిందీ మరియు తమిళ వెర్షన్ హీరో క్యారెక్టరైజేషన్ ను చూసిన వాళ్ల కు తెలుస్తుంది. టీజర్ రిలీజ్ ముందు వరకు ఈ సినిమా మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం వారికి ‘వకీల్ సాబ్’ పై పిక్చర్ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
మన తెలుగు ‘వకీల్ సాబ్’ టీజర్ ను చూస్తుంటే హిందీ మరియు తమిళ వర్సన్స్ తో అస్సలు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తుంది. తెలుగు లో ఎక్కువగా యాక్షన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో హీరోది లాయర్ పాత్ర అయినప్పటికీ దర్శకుడు వేణు శ్రీరామ్ ఫ్యాన్స్ కోసం చాలానే మార్పులు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఫ్యాన్స్ కు నచ్చే విధంగా రూపొందించడానికి చాలా ప్రయతిన్స్తున్నారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిమిత్తం శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే, మొత్తం మీద ఈ సినిమా లో పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చాలానే మార్పులు చేసినట్లు చెప్పవచ్చు.