Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మొదటినుండి పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ప్రాచీనమైన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరహర అలియాస్ వీర హరిహర జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1330లలో జరిగిన కథను చూపించేందుకు తన క్రిష్ తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక కొద్ది సేపటి క్రితం విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ లో పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్ లో అదరగొట్టాడు అనే చెప్పాలి. ముఖ్యంగా బల్లెం ను తన విధంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఇరగదీస్తాడు అని ఇప్పటికే దర్శకుడు ఈ వీడియో ద్వారా హింట్ ఇచ్చేసాడు. దానికితోడు ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన స్వరాలు కూడా అభిమానులను మరింత ఉత్తేజ పరుస్తాయి.
ఈ వీడియో తోనే సినిమా టైటిల్ ‘హరి హర మల్లు’ గా చిత్రబృందం ప్రకటించింది. క్యాప్షన్ కూడా ‘ది లెజెండరీ హీరోయిక్ అవుట్ లా’ అని పెట్టారు. ఈ వీడియో మొత్తానికి హైలెట్ పవన్ కళ్యాణ్ ఒక ఓడపైకి అత్యంత ఎత్తు నుండి దూకే సన్నివేశం. ఇక ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పెద్ద వరం లా కనిపిస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?