వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస క్రేజీ ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో సినిమా ఇండస్ట్రీ మొత్తం లైట్ మ్యాన్ మొదలుకొని టాప్ డైరెక్టర్ వరకు అందరూ ఇంటిలో ఉంటే రాంగోపాల్ వర్మ ఇంట్లో నుండే ‘క్లైమాక్స్’ అనే సినిమా తెరకెక్కించి లాక్ డౌన్ టైమ్ లోనే రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చి మంచి లాభాలు అందుకున్నాడు. మసాలా కంటెంట్ గా వచ్చిన క్లైమాక్స్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిన వర్మ కి బాగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల ఫాదర్స్ డే నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన అమృత ప్రణయ్ లవ్ ఎపిసోడ్ పై సినిమా తీయాలని రెడీ అవుతున్నట్లు తెలియజేస్తూ సినిమాకి ‘మర్డర్’ అనే టైటిల్ వర్మ ప్రకటించడం జరిగింది.
దళితుడైన ప్రణయ్ తన కూతురు అమృతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తండ్రి మారుతీ రావు చంపించడం…దాని ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఆ సినిమా మొదలుపెట్టక ముందే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ సినిమా ఇదే అంటూ ‘పవర్ స్టార్’ టైటిల్ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలియజేశారు. ‘బ్రేకింగ్ న్యూస్.. నా ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లో వచ్చే తదుపరి సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. ఇందులో PK, MS, NB, TS, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. ఇక ఈ సినిమాలోని పాత్రల గురించి అర్ధం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు మాత్రం ఇవ్వను’ అని RGV ట్వీట్ చేశాడు.
అయితే ఈ సినిమా ఏం ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడా అన్న అనుమానాలు పవన్ కళ్యాణ్ అభిమానులలో నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా బేస్ చేసుకుని తీస్తున్నాడా లేకపోతే రాజకీయాలను బేస్ చేసుకుని తీస్తున్నాడా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రాజకీయాలను ఆధారం చేసుకుని ఆర్జివి ఈ సినిమా తీస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓడిపోయి ఉన్నాడు అభిమానులు కూడా ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు…ఇలాంటి టైమ్ లో సినిమా చేస్తే మాత్రం పవన్ ఫాన్స్ ఆగ్రహానికి ఆర్జివి గురయ్యే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. ట్విటర్లో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి పవన్ కళ్యాణ్ లాంటి డూప్ వ్యక్తిని తన ఆఫీసులో ‘అత్తారింటికి దారేది’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో రామ్ గోపాల్ వర్మ చిన్న షాట్ తీయడం జరిగింది. మరి ఈ డూప్ పవన్ కళ్యాణ్ తో ఆర్జివి ఎటువంటి ప్రయోగం చేస్తారో చూడాలి.
Here is the STAR of my new film POWER STAR …This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8
— Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?