Pawan Kalyan : మెగా ఫ్యామిలీ లో నుండి అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీలో స్థిరపడినా కూడా వారిలో లో ఏ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనపడటం అనేది చాలా అరుదు. ఎవరికి వారే స్టార్లు అయిపోయి సోలో సినిమాలు చేసుకుంటున్నారు. ఇక అలాంటి వారికి మల్టీస్టారర్ కథలు రాసేందుకు కూడా దర్శకులకి చాలా ధైర్యం ఉండాలి. ఇక తాజాగా వచ్చిన ఒక మెగా అప్డేట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కలను తీర్చేలా ఉంది.
విషయం ఏమిటంటే…. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోతో సమానమైన ఒక కీలక పాత్ర ఉందని ఆ పాత్ర పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారట.
ఇక ఇదే విషయం శంకర్ తో కూడా చెబితే అతను కూడా ముందు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తమిళంలో కూడా నిర్మిస్తున్నారు కనుక అక్కడ స్టార్ ను ఎవరినైనా పెడితే బాగుంటుందని కూడా శంకర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా అతనిని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు.
కానీ శంకర్ మాత్రం అటు పవన్ కళ్యాణ్ ఇటు తమిళ స్టార్ హీరో ల మధ్య సందిగ్దంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరి రామ్ చరణ్-పవన్ కళ్యాణ్ లను ఒకే స్క్రీన్ పైన చూసే మోక్షం మెగా అభిమానులకు పుడుతుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాలి.