NewsOrbit
న్యూస్ సినిమా

నిహారిక పెళ్లి కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్!

Share

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాగబాబు ఏకైక కుమార్తె నిహారికా, చైతన్యల వివాహానికి ఏర్పట్లన్నీ దాదాపుగా కంప్లీట్ కావొచ్చాయని తెలుస్తోంది. కరోనాను ధృష్టిలో ఉంచుకుని అతి తక్కువ బంధువులకు, అథితులకు ఆహ్వానం పంపుతున్నట్టు సమాచారం. అయితే ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే నిహారికా, చైతన్యల ఎంగేజ్ మెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. కాగా పెళ్లికి కూడా హాజరవుతారో లేదోనని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ మూవీ షూటింగ్ లో ఈయన బిజీగా ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. అయితే ఈ విషయం పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

అయితే అల్లరి పిల్ల నిహారికా మాత్రం పెద్దనాన్న, చిన్ననాన్న అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర హామీ తీసుకుందంటండోయ్.. అదే నండి నా పెళ్లికి ఖచ్చితంగా రావాల్సిందేనని మాట తీసుకుని ప్రత్యేకంగా వారిని ఇన్వైట్ చేసేసిందట. ఇంకేముంది వారిరువురూ నిహారికా బ్యూటీ పెళ్లికి తప్పకుండా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సినీ వర్గాల నుంచి తెలుసుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం షూటింగ్ నడుస్తున్న వకీల్ సాబ్ సినిమాకు డిసెంబర్ లో వారం రోజుల పాటు బ్రేక్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఎందుకుంటే నిహారికా పెళ్లి కారణంగానే వారం రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఫ్యామిలీతో వెళ్లి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకేముంది నిహారికా పెళ్లితో మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేయబోతున్నారు.


Share

Related posts

Today Gold Rate: మళ్ళీ జోరు పెంచిన బంగారం ధరలు..!! నేటి ధరలు ఇలా..

bharani jella

SVP: మహేష్ “సర్కారు వారి పాట” కి సంబంధించి అభిమానులకు మరో గుడ్ న్యూస్..!!

sekhar

weight loss: బరువు తగ్గాలంటే  అన్నిటి కంటే ముందు ఈ విషయం మీద దృష్టి పెట్టండి… మంచి ఫలితం వచ్చి తీరుతుంది !!

siddhu