Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 28వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు సెప్టెంబర్ 2వ తారీఖు ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన సినిమా నిర్మించే సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది. దీంతో అప్పటి నుండి ఈ సినిమా పై సోషల్ మీడియాలో వస్తున్న అనేక వార్తలు వస్తున్నాయి.
కారణం చూస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతోపాటు గతంలో పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ అనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ హిట్ అందివడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి అవడం మాత్రమే కాక నటీనటులను తీసుకునే ఈ విషయంలో చాలా వరకు హరీష్ కంప్లీట్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది.
Read more: Pawan Kalyan: మార్కెట్ లో టాప్ మోస్ట్ కార్ బుక్ చేసిన పవన్ కళ్యాణ్..??
ఇటువంటి తరుణంలో సినిమాలో హీరోయిన్ విషయంలో మొదటిలో హరీష్ శంకర్ లక్కీ హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినపడగా తాజాగా.. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినబడుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్ర కియారా అద్వానీ తో చేయించే ఆలోచనలో.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఉన్నట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటికే హరీష్ స్క్రిప్ట్ వినిపించినట్లు పవన్ కావటంతో ఆమె కూడా ఓకే అన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా లో పవన్ ఎనర్జీ.. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసి.. హరీష్ పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు చూసిన పవన్ అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇదే ఇంపాక్ట్ స్క్రీన్ మీద వస్తే.. మీ ఇంటి ముందుకు వచ్చి దాదాపు వెయ్యి కొబ్బరికాయలు కొడతా అంటూ ఓ వీరాభిమాని.. హరీష్ చేసిన పోస్ట్ కి రిప్లై ఇవ్వటం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఓ వైవిధ్యంగా చూపించాలని.. ఆ తరహాలోనే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. బద్రి తరహా ఎనర్జీ ఉన్నట్లు హరీష్ వీడియో పోస్ట్ చేయడంతో మరింత గా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సెప్టెంబర్ మాసంలో పవన్ పుట్టినరోజు నాడు.. సినిమాకి సంబంధించి లుక్ రిలీజ్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.