NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ.. దాదాపు 35 నిమిషాలు చర్చలు

Share

విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని మోడీతో పవన్ సమావేశమైయ్యారు. దాదాపు 35 నిమిషాల పాటు చర్చలు జరిపారు. పీఎంఓ కార్యాలయం నుండే ముందుగా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సాయంత్రానికి విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి నోవాటెల్ హోటల్ వెళ్లి కొద్ది సేపు ఉన్న తర్వాత ప్రధాని బస చేసే ఐఎన్ఎస్ చోళకు చేరుకున్నారు.

Pawan Kalyan Meet pm modi

 

వర్షం కారణంగా ప్రధాన మంత్రి మోడీ విశాఖ రాక ఆలస్యం కావడంతో బీజేపీ కోర్ కమిటీ నేతల సమావేశంకు ముందే పవన్ కళ్యాణ్ తో పీఎం మోడీ సమావేశమైయ్యారు. ప్రధానితో భేటీలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రస్తావించినట్లుగా భావిస్తున్నారు. వివిధ అంశాలకు సంబంధించి అయిదు పేజీల నోట్ పవన్ సిద్దం చేసుకుని వాటిని మోడీ వద్ద మాట్లాడినట్లు తెలుస్తొంది. మోడీతో బేటీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ నోవాటెల్ కు వెళ్లిపోయారు.

Advertisements

Share

Related posts

ఇద్దరు తెలంగాణ ఎంపీలకు కరోనా..!!

sekhar

రాజస్థాన్ లో హస్తవాసి

Siva Prasad

MP RRR Letters War: ఏపి సీఎం వైఎస్ జగన్‌కు రఘురామ నాల్గవ లేఖ..! ఇందులో ఏముందంటే..!?

somaraju sharma