NewsOrbit
న్యూస్ సినిమా

Breaking: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా టైటిల్ పేరు “భగత్ సింగ్”..??

Share

Breaking: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సెట్స్ పై ఉండగానే చాలా ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరిగింది. వాటిలో ఒకటి హరీష్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు.. ఈ ప్రాజెక్టు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు.

JanaSena Party on Twitter: "JanaSena Chief @PawanKalyan Nellore district review meeting.… "

ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అంతకుమించి అంటూ పేర్కొన్నారు. కాగా ఆ రోజు టైటిల్ ప్రకటిస్తారని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూడటం జరిగింది. కానీ నిరాశ పరుస్తూ ఒక స్టైలిష్ బైక్ పై.. పవన్ ఫేస్ లేని కూర్చున్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ “భగత్ సింగ్” అనే టాక్ సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. సమాజం పై పవన్ ఆలోచనల సరళి కి తగ్గట్టు రీతిలో స్క్రిప్టు ఉంటుందని.., చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో…పవన్ కనిపించనున్నట్లు సమాచారం.

 

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “గబ్బర్ సింగ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే స్లాంగ్ లో… ఈ సినిమా టైటిల్ వుంటే బాగుంటుందని నిర్మాతలు భావించి “భగత్ సింగ్” టైటిల్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ “భీమ్ల నాయక్”, “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన వెంటనే హరీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ లాంటి హిట్ మళ్ళీ పవన్ కి పడాలని ఫాన్స్ అంటున్నారు. 


Share

Related posts

పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్

somaraju sharma

సుశాంత్ సూసైడ్ ముందు పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ లో ఏముంది?

Yandamuri

Anasuya Bharadwaj Latest Photoshoot

Gallery Desk