Pawan kalyan: నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ అదే..!

Share

Pawan kalyan: బరిలోకి దిగేంతవరకే ఆలోచిస్తారు..ఒక్కసారి దిగాక ఇక ఆలోచించడాలుండవు..పని పూర్తి చేసేయడమే. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్టాటజీ సినిమాల విషయంలో దాదాపు ఇలాగే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టాక ఇక సినిమాలు చేయనని నిర్ణయించుకున్నారు. కానీ, ఆయన అభిమానులు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలని గట్టిగా పట్టుపట్టారు. ఆయన ఎక్కడ సభ పెట్టినా ఫైనల్‌గా మాత్రం సినిమాల టాపిక్ వచ్చేది. దాంతో మళ్ళీ సినిమాలు చేయాలని పవర్‌స్టార్ డిసైడయ్యారు.

Pawan kalyan next target is that
Pawan kalyan next target is that

అలా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్‌ను తెలుగులో అఫీషియల్‌గా రీమేక్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అంతేకాదు వరుసగా 5 ప్రాజెక్ట్స్‌ను కమిటయ్యారు. అందులో భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకువచ్చి సమాంతరంగా షూటింగ్ చేశారు. అయితే ఇంతలోనే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ రావడం, పవన్‌కు కరోనా సోకడంతో షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యాయి. మళ్ళీ ఎట్టకేలకి భీమ్లా నాయక్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన పవన్ టాకీపార్ట్ మొత్తం కంప్లీట్ చేసినట్టు సమాచారం.

Pawan kalyan: హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌లో జాయిన్ అవబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్.

ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీరియాడికల్ సినిమా హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌లో జాయిన్ అవబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాం పాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజస్తాన్‌లో ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇటీవలే క్రిష్, నిర్మాత ఏ.ఎం.రత్నం లొకేషన్‌ను ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు బల్క్ డేట్స్ ఇచ్చారట పవన్ కళ్యాణ్. కాగా భీమ్లా నాయక్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.


Share

Related posts

శర్వానంద్‌కు షూటింగ్‌లో ప్ర‌మాదం

Siva Prasad

ఇది నిజంగా జరిగితే .. భూమ్మీద ఉన్నవాళ్ళు అందరూ కోటీశ్వరులే .. ! 

sekhar

బ్రేకింగ్: నిమ్మగడ్డ ప్రెస్ మీట్?

CMR