Pawan kalyan: వచ్చే ఏడాదికి అభిమానులకు త్రిబుల్ ధమాకా రెడీ చేసిన పవన్ కళ్యాణ్..!!

Share

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ అవ్వక ముందే చాలా సినిమాలు లైన్ లో పెట్టడం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయ రంగంలో పవన్ బిజీ కావటంతో.. అభిమానుల ఆకలి తీర్చడానికి పవన్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఈపాటికి పవన్ మూడు సినిమాలు రిలీజ్ చేసే ఉండేవారు.

Vakeel Saab actor Pawan Kalyan goes into self quarantine after members of  Janasena test COVID-19 positive | Regional-cinema News – India TVఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్కళ్యాణ్ రానాతో మల్టీస్టారర్ సినిమా షూటింగులో పాల్గొంటున్న మరోపక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు ఏడాదికి పైగానే మూతబడి ఉండటం వల్ల చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సినవి వాయిదాపడుతూ రావడం తెలిసిందే.

Read more: Pawan kalyan: కోటి రూపాయల చెక్కు అందించిన పవన్ కళ్యాణ్..!!

ఇదిలా ఉంటే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం మరోపక్క కరుణ తీవ్రత తగ్గుముఖం పట్టినట్లు ఉండటం తో.. వచ్చే ఏడాది పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉండటంతో.. సినిమా ధియేటర్ లో ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండటంతో.. ఏకంగా మూడు సినిమాలు వచ్చే ఏడాది లో రిలీజ్ చేసి త్రిబుల్ ధమాకా అభిమానులకు పవన్ సెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న రానా మల్టీస్టారర్ సినిమా అదే రీతిలో హరిహర వీరమల్లు ఇక హరీష్ శంకర్ సినిమా కూడా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఏది ఏమైనా సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ముందుగానే పొలిటికల్ గా మళ్లీ బిజీ అవ్వాలని పవన్ ఈ మధ్య గ్యాప్ లో వీలైనంత సినిమాలు చేసి రిలీజ్ చేయాలని.. అభిమానులను అలరించాలని అనుకుంటున్నారట.


Share

Related posts

బాబుకు కొలుసు సవాల్

somaraju sharma

ఇసుకపై టిడిపి సమరం

somaraju sharma

Rakul Preet Singh Tennis Premier Photoshoot Clicks

Gallery Desk