Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రాజమౌళి కాంబినేషన్ సెట్ అయిందా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరసగా మరో 5 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒకటి సెట్స్ మీదకి తీసుకు వస్తున్నారు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.ఈ సినిమా తర్వాత అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రం రచనా సహకారం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అవగా ఈ నెల 22 నుంచి తాజా షెడ్యూల్ మొదలవబోతోంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుండగా పవన్ కళ్యాణ్ మీద కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంది. అలాగే బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఒక మూవీ చేయాల్సి ఉంది.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తుండగా ఈ కథ ని తెర పైకి తీసుకు వచ్చే దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
కాగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కథ రాస్తున్నట్టు సమాచారం. రాజమౌళి తండ్రి ..విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎక్కువగా రాజమౌళి కోసమే కథలు రాశారు. మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో పాటు ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ కి కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో సెన్షేషనల్ హిట్ అయిన భజరంగీ భాయ్ జాన్ లాంటి సినిమాకి కథ అందించారు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తుండగా ఈ కథ ని తెర పైకి తీసుకు వచ్చే దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.