33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా ఏకే రీమేక్ టైటిల్ ‘భీమ్లా నాయక్’

Share

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ సినిమా అంటే అందరూ ముందు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ డైలాగ్, టీజర్ ఇలాంటి వాటి కోసం అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సినిమాకి కూడా ముందు టైటిల్ ఏంటో అని తెగ ఆరాటపడ్డారు. బాలీవుడ్‌లో పింక్ అని పెట్టారు. మరి తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు కాకుండా మరేదైనా పెడతారా, అది సూటవుతుందా అని చర్చించుకున్నారు. కానీ మేకర్స్ ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగానే వకీల్ సాబ్ అని పెట్టి సినిమా మీద అంచనాలు పెంచారు.

pawan-kalyan-rana-ak-remake-title-beemla-nayak
pawan-kalyan-rana-ak-remake-title-beemla-nayak

ఇక ప్రస్తుతం ఆయన నటుస్తున్న మల్టీస్టారర్ మలాయళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం. మలయాళంలో అయ్యప్పన్ -కోషి పేర్లతో ఇద్దరు స్టార్ హీరోలు నటించగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇదే సినిమాను ఇక్కడ పవర్ స్టార్ – రానా చేస్తుండటం విశేషం. అయితే దీనికి టైటిల్ ఏం పెట్టనున్నారనేది గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేస్తూ లుక్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు కూడా భీమ్లా నాయక్ అని రివీల్ చేశారు.

Pawan kalyan : “భీమ్లా నాయక్” అనే పవర్ ఫుల్ టైటిల్ నే ఏకే రీమేక్ సినిమాకి పెట్టారు.

ఈ సినిమా టైటిల్ భీమ్లా నాయక్ అని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.  సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ బర్త్ డే. “భీమ్లా నాయక్” అనే పవర్ ఫుల్ టైటిల్ నే ఏకే రీమేక్ సినిమాకి పెట్టారు.  కాగా ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.


Share

Related posts

సమంత బాటలో మిల్కీ బ్యూటీ

Siva Prasad

కాఫీ డే ఔట్ లెట్స్ భారీగా తగ్గింపు.. కారణాలివే

Muraliak

ఐపీఎల్ 2020 టీమ్‌లకు చెందిన కెప్టెన్ల విన్ ప‌ర్సంటేజ్ ఎంతో తెలుసా..?

Srikanth A