Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానాల మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..ఎప్పుడంటే

Share

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానాల హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఏ డేట్‌కి రిలీజ్ చేయనున్నారనేది మాత్రం వెల్లడించలేదు. కాగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం జనవరి 14న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట కూడా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దాంతో పవన్ కళ్యాణ్ – రానాల సినిమా రిలీజ్ డేట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి తాజాగా మేకర్స్ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు.

pawan-kalyan-rana movie date is fixed on 12,jan, 2021
pawan-kalyan-rana movie date is fixed on 12,jan, 2021

2022 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసి ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్, రిలీజెస్ ఆగిపోయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు అధికారకంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించేస్తున్నాయి. దాంతో ఈసారి 2022 సంక్రాంతికి బిగ్ ఫైట్ ఉంటుందని క్లియర్‌గా తెలుస్తోంది. అందరూ పెద్ద స్టార్స్..అన్నీ పెద్ద ప్రాజెక్ట్స్. ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే అభిమానులు నరాలు తెగిపోయో ఉత్కంఠతతో ఉన్నారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా, మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పటికే తమ సినిమాలలో రెడీ అయ్యారు.

పవన్ కళ్యాణ్ – రానా, మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పటికే తమ సినిమాలలో రెడీ అయ్యారు. అలాగే కింగ్ నాగార్జున – ఆయన కొడుకు నాగ చైతన్య కలిసి నటించబోతున్న బంగార్రాజు సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని నాగార్జున బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్ 3 కూడా సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్ గా వస్తోంది. ఎఫ్ 2 2019లో సంక్రాంతికే వచ్చి 100 కోట్లు రాబట్టింది. అదే సెంటిమెంట్ ఎఫ్ 3కి ఫాలో అవుతూ 2022 సంక్రాంతికి రావాలని చూస్తున్నారట. చూడాలి ఈసారి చాలా ఠఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది.


Share

Related posts

వైసీపీ లో వారికే ఎందుకిలా… లోలోపల ఏం జరుగుతోంది…?

arun kanna

Job Notification : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఖాళీలు

bharani jella

రూ. 100 పెట్టి ఉల్లి కొంటున్నాం..! ఓ సారి చరిత్ర తెలుసుకోపోతే ఎలా..!?

bharani jella