ఢిల్లీలో తిప్పలు పడుతున్న పవన్ కళ్యాణ్..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుండి తప్పుకోవడం మరోపక్క ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ పెద్దల నుండి ఆహ్వానం అందటం తో తెలుగు రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కి బిజెపి పెద్దల అపాయింట్మెంట్ దొరకడానికి చాలా టైం పట్టినట్లు అనేక తిప్పలు పడినట్లు తెలుస్తోంది.

BJP's big request to Pawan Kalyanఇదిలా ఉండగా బిజెపి హైకమాండ్ పెద్దలతో పవన్ కళ్యాణ్ జరుపుతున్న చర్చలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని టాక్ వస్తోంది. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి… ఎంపీ సీటు విషయంలో బీజేపీ అధిష్టానం నుండి సరైన స్పష్టత పవన్ కళ్యాణ్ కి ఇంకా రాలేదంటూ ఢిల్లీ నుండి వార్తలు అందుతున్నాయి.

 

ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన పార్టీ పోటీ చేయడమే అని సరికొత్త టాక్ వస్తోంది. మరోపక్క తిరుపతి ఉప ఎన్నిక ఎంపీ సీటు విషయంలో ఏపీ బీజేపీ నేతలు సమస్యలతో జనసేన పార్టీ కి ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగా పార్టీ పెద్దలతో ఇక్కడి నుండి చర్చలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే తిరుపతి ఎంపీ సీట్ పొందు కోవటానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సీటు కు సంబంధించి సరైన స్పష్టత ఇంకా రాకపోవటంతో పవన్ కళ్యాణ్ కాషాయ దళ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సరికొత్త టాక్ వస్తుంది. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ బాగా ఆరాట పడుతున్నట్టు తెలుస్తోంది. కారణం చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎక్కువశాతం కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లు ఉండటంతో పాటు గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఈ ప్రాంతంలో బాగా ఆదరణ లభించడంతో.. ఈ రిజర్వడ్ ఎంపీ స్థానాన్ని జనసేన పార్టీ తరఫున సరికొత్త అభ్యర్థిని పోటీకి నిలబెట్టి… ఎన్నికల బరిలో పోటీ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.