Pawan Kalyan: వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వం మార్చేస్తా అంటున్న పవన్ కళ్యాణ్..!!

Share

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ దారుణంగా పరిపాలిస్తున్నట్లూ అన్ని వ్యవస్థలను నీరుగార్చినట్లు పవన్ మండిపడ్డారు. తాను సమస్యల నుండి పారిపోయే వ్యక్తిని కాదని, కచ్చితంగా బలంగా ఎదుర్కొంటా అని చెప్పుకొచ్చారు. కులాల మధ్య వర్గ పోరు అన్న తరహాలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అభివృద్ధిని పక్కన పెడుతోంది అని అన్నారు.

May be an image of 14 people, people standing and text that says "JANASENA జనసేన जनसेना जन सेना W"

గత ఎన్నికలలో జరిగిన తప్పుల విషయంలో పశ్చాతా పడుతున్నాను అని ఒక్కసారి నన్ను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని శాంతిభద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తా, ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకు వస్తా అంటూ పవన్.. ఉద్వేగంగా ప్రసంగించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 151 సీట్లు ఉన్న వైసీపీ ని 15 సీట్లకే పరిమితం చేస్తానని..ప్రభుత్వం మార్చేస్తా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు పాండవులు సభ ఎలా ఉంటుందో… వైసీపీ నాయకులకు చూపిస్తా ఇదే నా సవాల్ ఏం చేస్తారో చేసుకోండి.

May be an image of 11 people, people standing and indoor

అణగారిన వర్గాలకు అండగా జనసేన

ఒక్కొక్కడికి తాట తీసి మోకాళ్ళమీద కూర్చో పెడతా..? ప్రతి ఒక్కటి గుర్తే. పార్టీ కార్యకర్తలపై ఎక్కడ ఏం జరిగినా రాసిపెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చాక.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఎంతసేపు రాజకీయం రెండు కులాల మధ్యే ఉండాలా..?, ఉన్న మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి..? అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

May be an image of 15 people, people sitting and people standing

వైసీపీ పార్టీ కమ్మ వారిని టార్గెట్ చేసుకుని పరిపాలన చేస్తుందని, ఆ  సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు.. పవన్ పేర్కొన్నారు. ఇదే తరుణంలో దళితులపై కూడా వైసీపీ ప్రభుత్వం.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా యుద్ధానికి సిద్ధమని.. అది ఏ రకంగా మీరే తేల్చుకోవాలి అంటూ వైసీపీకి ఛాలెంజ్ విసిరారు. చావును కూడా లెక్క చేయను.. అంటూ ఉద్వేగంగా ప్రసంగిస్తూ సమయం వచ్చినప్పుడు తమ పార్టీ వ్యూహాలు కూడా మారుతాయని.. పవన్ పేర్కొన్నారు.


Share

Related posts

78 వేలకు చేరిన కరోనా కేసులు

somaraju sharma

బ్రోకరిజం… శాడిజం…మూర్కిజం ! రాధాకృష్ణ ను చెడుగుడు ఆడేస్తున్నారు!!

Yandamuri

బాలకృష్ణ సినిమాలో యంగ్ హీరో అలా కనిపిస్తే భారీ ప్రయోగమే ..?

GRK