Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేము. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో.. ఇండస్ట్రీ వర్గాలలో ఉండే ఆసక్తి ..చర్చలు తారా స్థాయిలో ఉంటాయి. పెద్దగా బయట ప్రసంగాలు.. సినిమా ఫంక్షన్స్ కి రాని పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక..ప్రజలకి సేవ చేయాలని సభలు.. చర్చలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే నెమ్మదిగా సినిమా ఫంక్షన్స్ కి రావడం మొదలు పెట్టాడు. ఆయన కోసం కొట్లలో అభిమానులు ఎప్పుడు.. ఎక్కడ.. ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు.
ఒక దర్శకుడు..ఒక నిర్మాత…ఒక హీరో..ఇలాంటి వారే పవన్ కళ్యాణ్ కి అభిమాని అంటే ..ఇక సామాన్య ప్రజలల్లో పవన్ మీద అభిమానం ఎలా ఉంటుంది. ఆయన బయట ఒక సభ పెడితే ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు.. జనాలు వచ్చేస్తారు. తాజాగా వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరా బాద్ శిల్పకళా వేధికలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి వకీల్ సాబ్ చిత్ర యూనిట్ సహా పలువురు సినిమా తారలు..అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పలు ఆసక్తికరమైన విషయాలకి ప్రతీ ఒక్కరు ఎంతగానో అట్రాక్ట్ అయ్యారు.
Pawan kalyan : ఆ కారణంగానే నేను సినిమాలకు దూరమయ్యానని అనిపించలేదు.
ముఖ్యంగా నిర్మాత బండ్ల గణేష్ గురించి చెప్పుకొచ్చాడు. నేను గణేష్ లా మాట్లాడలేను.. సినిమా ఫంక్షన్స్ కి వచ్చి చాలా ఏళ్ళయింది. నేను సినిమా చేసి మూడు సంవత్సరాలు దాటిందన్న భావన నాకు కలగలేదు. ఎందుకంటే ‘నా గుండె మన దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటుంది’.. ఆ కారణంగానే నేను సినిమాలకు దూరమయ్యానని అనిపించలేదు. అంటూ దేశం పట్ల ..తన అభిమానుల పట్ల తనకున్న ప్రేమాభిమానాలు చెప్పకనే చెప్పాడు. కాగా వకీల్ సాబ్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.