NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తిరుపతి సీట్ బీజేపీదేనా ? : స్థానిక పరిస్థితులపై పవన్ మౌనం

 

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది..? స్థానిక పరిస్థితులు.. 7 నియోజకవర్గాల్లో బలాబలాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుపతి లోక్ సభ పరిధిలోని రెండు పార్టీల నాయకులతో చర్చించారు. నివర్ తుఫాన్ బాధిత రైతుల పరామర్శకు వచ్చిన ఆయన శుక్రవారం నెల్లూరు వెళ్తూ వెళ్తూ వచ్చిన నాయకులను కూర్చుబెట్టి విషయాలపై మాట్లాడారు. తిరుపతి పరిస్థితిని అంచనా వేశారు.

** సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులూ భానుప్రకాష్ రెడ్డి , కోలా ఆనంద్ వంటి వారు పాల్గొన్నారు. జనసేన నుంచి పవన్, మనోహర్ లు దీనిపై చర్చించారు. నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావం చూపించే ఎస్సి నియోజకవర్గాల్లో పరిస్థితిని పవన్ తెలుసుకునేందుకు పయత్నించగా, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి ఎవరు నాయకులే కనిపించలేదు. తిరుపతి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ఎం శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినుత మాత్రమే మొత్తం పరిస్థితి వివరించే ప్రయత్నం చేయగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలతోనే పవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులూ సైతం స్థానిక పరిస్థితులను పవన్కు వివరించారు.
** గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను పవన్ కనుక్కున్నారు, గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ శ్రీహరి రావు పొత్తులో భాగంగా నుంచున్నారని ఆయనకు 20 , 971 ఓట్లు సాధించారని అలాగే బీజేపీ నుంచి పోటీ చేసిన బొమ్మి శ్రీహరి రావు కు 16 , 125 ఓట్లు వచ్చినట్లు నాయకులూ లెక్కలను చెప్పారు. ఇవి నోటా కు వచ్చిన 25 , 781 వచ్చిన ఓట్ల కంటే తక్కువ అని పవన్ తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ ఎందుకు వచ్చాయి అని … అక్కడున్న పరిస్థితులు తెలుసుకుని పవన్ మౌనం వహించినట్లు తెలిసింది.


** ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది… ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తే ముందుకు వెళ్లొచ్చు అనేది బీజేపీ, జనసేన నాయకులూ కూర్చుని వెంటనే సిద్ధం చేయాలనీ పవన్ ఆదేశించారు. ఒక కార్యాచరణ నివేదిక ఇస్తే దాని మీద స్టడీ చేసి బీజేపీ పెద్దలతో మాట్లాడి ముందుకు వెళ్లొచ్చు అని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు లోక్ సభ పరిధిలో మండలాల వారీగా వెంటనే కమిటీలను నియమించాలని జనసేన నాయకుల్ని పవన్ గట్టిగ ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రాంతాలకే కమిటీల నియామకం పట్ల పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో కమిటీలు వేయాలని, వెంటనే తగు కార్యాచరణ రూపొందించుకునేలా ఆక్టివ్ కావాలని, ఎప్పటికి అప్పుడు పార్టీ నేత మనోహర్ తో టచ్ లో ఉంది , ఆయన సూచనలు సలహాలతో అన్ని నియోజకవర్గాల్లో , మండలాల్లో కమిటీలు వేయాలని నేతలకు సూచించారు.
** సమావేశం చివర్లో బీజేపీ నాయకులూ కల్పించుకుని ఈ సారికి బీజేపీ కి టికెట్ ఇచ్చేలా ఆలోచించాలని పవన్ కు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో జోష్ మీద ఉన్న బీజేపీ ఎక్కడ గతంలో ఒకసారి పొత్తులో భాగంగా బీజేపీ మంచి వోటింగ్ శాతం సాధించిన విషయాన్నీ పవన్ కు గుర్తు చేసారు. బీజేపీ అభ్యర్థి గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పోటీ చేసేందుకు సుముఖత చూపుతున్నారని, విద్యావంతుడిగా, వివాద రహితుడిగా ఉన్న ఆయనను రంగంలోకి దింపితే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకులూ ఓ రిటైర్డ్ ఐఏఎస్ పేరును పవన్ ముందు ఉంచారు. బీజేపీ జాతీయ నాయకులూ, మీరు ప్రచారానికి వస్తే ఊపు వస్తున్నాడని, ఇప్పటికే తిరుపతి, శ్రీకాళహస్తి, వేంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో బీజేపీ కి ఉన్న బలాన్ని పవన్కు వివరించారు..
** అన్ని శ్రద్దగా విన్న పవన్ దీనిపై ఎలాంటి మాట ఇవ్వకుండానే మౌనం వహించినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలతోనే దీనిపై మాట్లాడి తగు నిర్ణయం తీసుకుందామని, అయితే స్థానికంగా రెండు పార్టీల నాయకులూ సహకరించుకుని ఉమ్మడి కార్యాచరణ తో ముందుకు వెళ్ళండి అని పవన్ సూచించారు. పవన్ మొత్తం విని జనసేన బలం, బీజేపీ తీరు విని టికెట్ విషయంలో మౌనం వహించడం చూస్తే విషయం అర్ధం అయినట్లే ఉందని… నాయకులూ చెబుతున్నారు.

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?