NewsOrbit
న్యూస్

Pawan Kalyan: వైసీపీ విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు .. వెటకారాలు ఆపి పని చూడండి అంటూ..

Pawan Kalyan: రాష్ట్రంలో ఉద్యోగుల జెఏసీ నుండి బయటకు వచ్చి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్న చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో సహా ఇతర రాజకీయ పక్షాలపై సీఎం జగన్ నిన్న విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. వైసీపీ నాయకులకు తాను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తాను ప్రజలకు దత్త పుత్రుడిని అని చెప్పారు. వైసీపీ నాయకులు, వాళ్ల సలహాదారులు మాట్లాడుతున్నది తన దృష్టికి వచ్చిందన్నారు. “ఉద్యోగుల సమస్యను మేము క్రియేట్ చేయలేదు. మేము సృష్టించింది కాదు. విపక్షాలు సృష్టించింది కాదు. వీళ్లు ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాం అంటూ చాలా ఆశలు కల్పించారు. వాళ్లకు రావాల్సినవే వారు అడుగుతున్నారు. పీఆర్సీ అమలు చేయమని వారు అడుగుతున్నారు. వాళ్లతో చాలా సమావేశాలు జరిగాయి. మంత్రులుతో సమావేశాలు జరిగాయి, వాళ్లకు కోపం వచ్చి వాళ్లు లక్షలాది మంది రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వం మీద నిరసన తెలిపితే దానికి జనసేన, మిగతా పార్టీలను అనడం ఎంత వరకు సమర్ధనీయం” అని ప్రశ్నించారు.

Pawan Kalyan slams ycp
Pawan Kalyan slams ycp

Pawan Kalyan: డూడూ బసవన్నలు కానీ అందరూ శతృవుల్లానే కనిపిస్తారు.

“వైసీపీ నాయకులకు గానీ, వారి ప్రభుత్వానికి గానీ ఉన్నది ఏమిటంటే మిమ్మల్ని ఎవరూ ఏమి అనకూడదు. మీరు ఏమి చేసినా సరే డూడూ బసవన్నలా తల ఊపేసి ముందుకు వెళ్లిపోవాలి. అలా కాదంటే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నుండి ఈ రోజు నల్లబ్యాడ్జీలు కట్టుకున్న టీచర్ల దాకా అందరూ మీకు శతృవుల్లానే మీకు కనిపిస్తారు. ఎందుకంటే మీకు డూడూ బసవన్న పని చేయలేదు కాబట్టి. న్యాయంగా వారి హక్కుల గురించి వాళ్లు అడిగితే మీరు పద్దతిగా చేయండి. వాళ్లు ఎందుకు వస్తారు రోడ్డు మీదకు. మీ మంత్రి వర్గంలో ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడతారే. అలానే ఈ రోజు టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హజరవుతుంటే అది ఏమి సూచిస్తుంది. అది మీ వైఫల్యం. మీరు ఇచ్చిన మాట మీద వెనక్కు వెళ్లడం వల్ల దాని వల్ల వచ్చింది వాళ్లకు. దానికి మమ్మల్ని అని వెటకారాలు చేస్తే ప్రయోజనం ఏమిటి. మీరు వెటకారాలు ఆపి పని చూడండి. వెటకారాలతో ముందుకు కాదు పనికి వచ్చే మాటలు మాట్లాడండి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!