దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ “పింక్” సినిమాని తెలుగులో “వకీల్ సాబ్” పేరిట రీమేక్ చేస్తూ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇండస్ట్రీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తికావటంతో త్వరలో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అంచనాలు భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో పీరియాడికల్ డ్రామా తరహాలో మొఘలుల కాలం నాటి సినిమా.. పవన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గుండుతో కనిపించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గుండుతో కనిపించడానికి రెడీ అయినట్లు.., మొదటి లో వద్దనుకున్నా గానీ స్టోరీ లో ఆ పాత్రకి మంచి దమ్ము ఉండటంతో క్రిష్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటువంటి తరుణంలో పవన్ గుండుతో అనే వాటికి ఈ వార్తపై చాలామంది అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంత మాత్రమే కాక మరి కొంతమంది అసలు వద్దంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఈ వార్త ఎక్కడ బయటకు రాలేదు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. దీంతో కొంతమంది చాలావరకు ఇది ఫేక్ అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గుండు పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు రావడంతో.. చాలామంది చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!