NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సోము వీర్రాజు ట్రాప్ లో పవన్ కళ్యాణ్…? త్యాగానికే సిద్ధం?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఎలా సాగుతాయోయి అన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు గతంలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ పొత్తు వల్ల వీరిద్దరి మధ్య త్వరలోనే ఎన్నో సమస్యలు వస్తాయని వారు అప్పుడే ఊహించారు. ఇక తెలంగాణలో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వెనక్కి తగ్గిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

 

 

pawan kalyan trapped by somu veerraju?
pawan kalyan trapped by somu veerraju

ఇంటికి వచ్చి మరీ….

జనసేన అభ్యర్థుల చేత ముందు పోటీ చేయించి ఆ తర్వాత బిజెపి కోరిక మేరకు ఆయన విత్ డ్రా చేయించారు. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల కోసం రెడీ అవుతూ ఆ సీటు కోసం కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే ఏపీ బీజెపీ మాత్రం తిరుపతి ఉప ఎన్నిక స్థానం తమదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ సీటు జనసేన కోసం వదులుకునేందుకు మాత్రం తాము ఏ రకంగానూ సిద్ధం లేము అని ఇన్ డైరెక్టుగా చెబుతోంది. ఈ క్రమంలోనే బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి మరి అతనిని దువ్వే పనిలో ఉన్నట్లు అర్థం అయింది.

జనసేనే మేలే…..

ఇక గ్రేటర్ ఎన్నికల్లో పవన్… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు వెనకడుగు వేశారు. ఇప్పుడు కూడా జనసేన ను తిరుపతి ఉపఎన్నిక నుండి డ్రాప్ చేసే బాధ్యతను సోము వీర్రాజు, పురంధేశ్వరి తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 2024లో బిజెపి-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావాలంటే ఇప్పుడు వారు తిరుపతి ఉప ఎన్నిక సీటుని త్యాగం చేయాల్సిందే అన్నట్లు సోము వీర్రాజు జనసేన పై ఒత్తిడి పెంచుతున్నారని అర్థం అవుతోంది. బిజెపి ఇప్పటికే ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలవలేదు. ఇక ఓట్ల శాతంలో వారితో పోలిస్తే జనసేన పార్టీ చాలా మేలు.

తిరుపతిని వాడుకుంటున్నారు….

ఇక అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కూడా తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక సీటు బీజేపీకి ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అన్న వాదనలు ఉన్నప్పటికీ జనాల్లో బిజెపి అంత తీవ్రంగా వెళ్ళిందా అన్న విషయంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ లాగే ఏపీలో కూడా బిజెపి లో ఊపు తీసుకుని వచ్చేందుకు తిరుపతి ఉపఎన్నిక సీటు ని వాడుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తమ జనసేనాని తగ్గకూడదని జనసేన అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ వెనక్కితగ్గే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరి పార్టీ వారి సంగతి?

ఈ ఒక్క సీటు బిజెపికి వదిలేస్తే పార్టీ పరపతి పెరిగి కేంద్రం వద్ద మైలేజీ వస్తుందని అతని ఆలోచిస్తున్నాడని సమాచారం. ఇక ఈ సీటు గెలిచినంత మాత్రాన జనసేన కు ఎంత వరకు లాభం వస్తుంది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే అటు హైదరాబాదులో ఇటు తిరుపతి లో వచ్చిన అవకాశాలని వదులుకుంటే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన కూడా జనసేన లో కనిపిస్తోంది. దీని వల్ల జనసైనికుల ఆత్మవిశ్వాసం కూడా భారీగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మరి పవన్ దారి ఎటు?

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju