NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్..సంక్రాంతికి బిగ్ ఫైట్

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. సెట్‌లో తాజాగా పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యాడు. మరోసారి పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు ఇందులో మేకోవర్ ఎలా ఉంటుందో మేకర్స్ రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా ఏకే రీమేక్ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేయడం అందరీకి ఆనందాన్ని కలిగిస్తోంది.

pawan-kalyan versus super star .... big fight during sankranthi
pawan kalyan versus super star big fight during sankranthi

అయితే తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకే రీమేక్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ‘భీమ్లా నాయక్’ అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు 2022 సంక్రాంతికి బిగ్ ఫైట్ ఉండబోతోంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Pawan kalyan : పవర్ స్టార్, సూపర్ స్టార్ లలో 2022 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో.

అయితే సర్కారు వారి పాట సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ఆ సమయానికి పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ ని బరిలో దించుతున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కి జంటగా నిత్యామీనన్, రానాకు జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా, సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇంతకముందు పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు నాలుగు సార్లు పోటీ పడ్డారు. అయితే ఒకేరోజు పోటీకి సిద్దమవడం మాత్రం ఇదే మొదటిసారి. చూడాలి మరి పవర్ స్టార్, సూపర్ స్టార్ లలో 2022 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఎవరో.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!