NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Jagan Pawan: జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

Jagan Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా రోడ్ల పరిస్థితి మారిందని.. రోడ్ల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పవన్ సీరియస్ అయ్యారు. ఇదే క్రమంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా రహదారుల వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో లక్షా ఇరవై వేల కిలోమీటర్లకు పైగా రహదారులు ఉన్నాయని స్పష్టం చేశారు.

A bump in the road - The Hindu

అటువంటి రోడ్లు దెబ్బతిన్న కానీ ప్రభుత్వంలో చలనం లేదని.. రోడ్లు మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ సెప్టెంబర్ 2, 3, 4 తారీకులలో సోషల్ మీడియాలో.. ఎవరికి వారు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి పోస్టులు పెట్టాలని పవన్ ప్రజలకు సూచించారు. అప్పుడైనా ప్రభుత్వంలో చలనం కలుగుతుందేమో చూడాలి అంటూ తెలిపారు. అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే అక్టోబర్ రెండో తారీకు… రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహించి రోడ్లను మనమే బాగు చేసుకుందామని పవన్ తెలిపారు.

 

గతంలో నివర్ తుఫాన్ వచ్చిన సమయంలో.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో పర్యటించిన సమయంలో కూడా రోడ్ల పరిస్థితి ఇలానే ఉందని పవన్ మండిపడ్డారు. ఇదేదో రాజకీయ విమర్శలకు లేకపోతే పొలిటికల్ మైలేజ్ కోసం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా.. రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో రోడ్లు గుంతలు కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులతో పాటు లాఠీ చార్జీలు చేస్తున్నారని.. అక్టోబర్ రెండవ తారీఖు లోపు రాష్ట్రంలో రోడ్ల సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju