Pawan Kalyan: “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజి పై వైసీపీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!!

Share

Pawan Kalyan: దేవా కట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా.. “రిపబ్లిక్”  సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లో భాగంగా… ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తో పెట్టుకుంటే.. కన్నెత్తి చూస్తే కాలి పోతారు చూడకండి చిత్ర పరిశ్రమ వైపు అంటూ హెచ్చరించారు. చాలా పరుష పదజాలంతో పవన్ కళ్యాణ్… వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఒకానొక టైంలో ఆ దేశంలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయంలో తెగ ఆందోళన అదే రీతిలో ఇంకా అభివృద్ధి చేయాలి అన్న రీతిగా చర్చ పెట్టుకున్న టైం లో… ఫ్రెంచ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. దయచేసి ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయంలో కలుగజేసుకొకండి.

Powerstar Pawan Kalyan Powerful Speech @ Republic Pre Release Event |  Shreyas Media - YouTube

మీ పని మీరు చూసుకోండి.. అంటూ తీవ్రంగా .. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేస్తే బాగుంటుందని హెచ్చరించారట. టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని.. ఇటీవల ప్రభుత్వాలు తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో రిపబ్లిక్ సినిమా డైరెక్టర్ దేవకట్టా స్పందించి ప్రైవేట్ పెట్టుబడులు.. పెడుతూ సినిమాలు చేస్తే ఈ విషయంలో ప్రభుత్వాలు.. కలుగజేసుకోవటం ఏమిటి.. అని నిర్మొహమాటంగా ఇండస్ట్రీలో నుండి ఆయన ప్రశ్నించారు నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ అని పవన్ కొనియాడారు. సినిమాలను గవర్నమెంట్ కంట్రోల్ చేయటం ఏంటి అని ప్రశ్నించడం.. గ్రేట్ అని దేవకట్టా ని ప్రశంసించారు. ఇక ఇదే తరుణంలో ఇండస్ట్రీ లో వైసీపీ మద్దతు దారులు మోహన్ బాబు ఇంకా కొంతమంది ఉన్నారు అనుకోండి… టికెట్లు ప్రభుత్వం అమ్ముతామని తెలిపిన రూల్… విద్యా సంస్థలకు కూడా వర్తింపజేస్తారా..??, స్కూల్ లకు సంబంధించి ఫీజులు ఆన్లైన్ లో… ఏపీ ప్రభుత్వం తట్టుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని.. అప్పుడు బాగుంటుందని పవన్ సంచలన డైలాగులు వేశారు.

కన్నెత్తి చూస్తే కాలిపోతరు పవన్ వార్నింగ్…

చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అని అనుకుంటున్నారేమో దీని బడ్జెట్ తక్కువ అని భావిస్తున్నారు ఏమో దీని ప్రభావం… చాలా ఎక్కువ అని.. పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ చిత్ర పరిశ్రమ వైపు చూస్తే కన్నెత్తి చూస్తే కాలిపోతరు అని పవన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు లక్షల కోట్లు సంపాదించే వచ్చా..??.. మేము చిత్రపరిశ్రమలో ఉండి అడుక్కు తినాలా?? సినిమాలు రిలీజ్ కాకుండా చేస్తారా అంటూ పవన్ తీవ్రస్థాయిలో.. వైసిపి నాయకులను ఉద్దేశించి రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఆన్లైన్ టికెట్ విధానాన్ని.. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్దలే తీసుకురావాలని కోరినట్లు వైసీపీ నాయకులు ఇటీవల మీడియా ముందు తెలపడం జరిగింది. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు… సీఎం జగన్ ని కలిసిన టైం లో… సినిమా టికెట్లు విషయంలో ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని.. కోరినట్లు వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియా ముందు తెలపడం జరిగింది. ఇక ఆ తర్వాత మొన్న సెప్టెంబర్ 20వ తారీకు టాలీవుడ్ టాప్ నిర్మాతలు మరియు డైరెక్టర్లు వైసిపి ప్రభుత్వం తో సమావేశమైన సమయంలో సమావేశం అనంతరం.. నిర్మాత ఆన్లైన్ టికెట్.. విధానాన్ని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మీడియా ముందు.. చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో.. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని టార్గెట్ చేసి కామెంట్ చేయటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


Share

Related posts

Reba MonicaJohn Latest Photos

Gallery Desk

AP Politics : రాజకీయ “న్యూ”స్ స్ట్రాటజీ.. @ ఏపీ రాజకీయం / తెలుగు మీడియా..!!

Srinivas Manem

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు

Siva Prasad