Pawan Kaylan : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సూపర్ హిట్ కాంబినేషన్ లో మొదటి వరుసలో ఉండేది త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఖుషి తర్వాత భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్న సమయంలో..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా పవన్ కళ్యాణ్ Pawan Kaylan కెరీర్ కి బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాక అభిమానుల కాలర్ ఎగరేసేలా చేసింది. సినిమా పరంగా మాత్రమే కాక త్రివిక్రమ్ .. పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలుసు. ఏనాడూ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పనీ పవన్… త్రివిక్రమ్ తన సన్నిహితుడు అని బహిరంగంగానే చాలాసార్లు చెప్పడం జరిగింది.
ఇదే క్రమంలో త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాల ఈ విషయంలో కొంత చనువు తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే త్వరలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం పవన్ రానా నటిస్తున్న సినిమాకి మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ త్వరలో పవన్ కళ్యాణ్ తో అదేవిధంగా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తో కలిపి మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రామ్ తండ్రి స్రవంతి రవి కిషోర్… వలన ఇండస్ట్రీలో తాను నిలదొక్కుకున్న ట్లు ఇటీవల ఓ సందర్భంలో త్రివిక్రమ్ చెప్పటంతో .. హీరో రామ్ కి మర్చిపోలేని విధమైన మూవీ అందించాలని… డిసైడ్ అయ్యి అందుకుగాను పవన్ తో కలిపి రామ్ తో మల్టీస్టారర్ కథ త్రివిక్రమ్ రెడీ చేసినట్లు టాక్. గతంలోనే ఎప్పటినుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ తో రామ్ సినిమా అనే పటికి పవన్ అభిమానులు ఈ వార్త విని ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.